»   » ఎంత కాలం ఒంటరిగా? మరో వ్యక్తితో జీవితాన్ని ప్రారంభించబోతున్న హీరోయిన్!

ఎంత కాలం ఒంటరిగా? మరో వ్యక్తితో జీవితాన్ని ప్రారంభించబోతున్న హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Karisma Kapoor To Get Married Again?

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తన బాయ్ ఫ్రెండ్ సందీప్ తోష్నివాలాతో కలిసి నిన్న రాత్రి(ఏప్రిల్ 3)న తన సోదరి కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ దంపతుల ఇంటికి రావడం చర్చనీయాంశం అయింది. ఈ ఫ్యామిలీ కలయికలో కునాల్ ఖేము, సోహా అలీ ఖాన్ దంపతులు కూడా పాల్గొన్నారు. బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కరిష్మా కపూర్, సందీప్ త్వరలోనే తమ రిలేషన్‌షిప్ గురించి అఫీషియల్ ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నారని, అయితే సందీప్ తన భార్య అర్షితతో విడాకుల కేసు సెటిలైన తర్వాత... ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

సందీప్ తోష్నివాలా, కరిష్మా కపూర్ గత మూడేళ్లుగా చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు తమ రిలేషన్ షిప్ గురించి వీరు అధికారికంగా వెల్లడించలేదు. కామన్ ఫ్రెండ్‌కు సంబంధించిన పార్టీలో ఓసారి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి వీరి మధ్న స్నేహం కొనసాగుతోంది. కపూర్ ఫ్యామిలీ నుండి కూడా వీరి రిలేషన్ షిప్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. గతంలో చాలా సార్లు సందీప్, కరిష్మాతో కలిసి కపూర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ మీటింగులకు హాజరవ్వడమే ఇందుకు నిదర్శనం.

సందీప్ తోష్నివాలా విడాకుల స్టోరీ

సందీప్ తోష్నివాలా విడాకుల స్టోరీ

సందీప్ తోష్నివాలా వివాహం అర్షితాతో జరిగింది. అయితే 14 ఏళ్ల కాపురం అనంతరం ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఎవరీ సందీప్ తోష్నివాలా?

ఎవరీ సందీప్ తోష్నివాలా?

సందీప్ తోష్నీవాలా దేశంలోని ఓ పెద్ద పార్మాసుటికల్ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. తన వృత్తి వ్యాపారంలో భాగంగా తరచూ పలు దేశాలు పర్యటిస్తూ ఉంటారు.

విడాకుల కేసు

విడాకుల కేసు

2017 నుండి సందీప్ తోష్నివాలా, అర్షిత విడాకుల కేసులో కోర్టులోనే ఉంది. 9, 12 సంవత్సరాల వయసు కలిగిన తన ఇద్దరు కూతుర్లకు చెరొక రూ. 3 కోట్లు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

భరణం, అపార్టుమెంటు ఆమెకే

భరణం, అపార్టుమెంటు ఆమెకే

అదే విధంగా అర్షితకు రూ. 2 కోట్లు భరణంగా ఇవ్వడంతో పాటు తన లగ్జరీ అపార్టుమెంటు కూడా ఆమెకు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సందీప్ కూడా అంగీకారం తెలిపారు.

పిల్లల ఎవరి కస్టడీ

పిల్లల ఎవరి కస్టడీ

2017లో కోర్టు తన ఆదేశాల్లో పిల్లలు అర్షిత కస్టడీలో ఉండాలని, ఇద్దరూ దానికి అంగీకారం తెలపాలని పేర్కొన్నారు.

ఆర్థోడాంటిస్ట్

ఆర్థోడాంటిస్ట్

వృత్తి పరంగా అర్షిత ఆర్థోడాంటిస్ట్. ముంబైలో సొంతగా కొన్ని క్లినిక్స్ రన్ చేస్తున్నారు. ఇతర ఆసుపత్రులకు కూడా ఆమె తన సేవలు అందిస్తున్నారు.

కరిష్మా విడాకుల కథ

కరిష్మా విడాకుల కథ

కరిష్మా కపూర్ తన మాజీ భర్త సంజయ్ కపూర్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సంజయ్ అనంతరం ప్రియా సచ్ దేవ్‌ను పెళ్లాడారు.

 కొత్త జీవితం ప్రారంభించబోతున్న కరిష్మా-సందీప్

కొత్త జీవితం ప్రారంభించబోతున్న కరిష్మా-సందీప్

తమ తమ జీవిత భాగస్వాముల నుండి విడిపోయిన కరిష్మా కపూర్, సందీప్ తోష్నివాలా కలిసి కొత్తగా జీవితం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు.

English summary
Karisma Kapoor was spotted with her boyfriend Sandeep Toshniwal last night on April 3, 2018 as the duo visited Kareena Kapoor and Saif Ali Khan's house for a small get together. The family get together was also attended by Kunal Khemu and Soha Ali Khan. Reports state that Karisma and Sandeep will soon make their relationship official and are only waiting for Sandeep's divorce with his wife Arshita to get settled, and will make their relationship public right after that.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X