మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రత.. బికినిలో సముద్రంలోకి కత్రినా.. ఏం జరిగిందో తెలుసా!

బాలీవుడ్ మెరుపు తీగ కత్రినా కైఫ్ సాహసం చేసింది. బాలీవుడ్ చిత్రాల్లో కళ్ళు చెదిరే గ్లామర్, స్టెప్పులతో ఆకట్టుకునే కత్రినా న్యూ ఇయర్ వేడుకల కోసం యూరప్ వెళ్ళింది. యూరప్ లో తన ఫ్యామిలీతో కలసి కత్రినా రచ్చ రచ్చ చేసింది. కత్రినా సాహసోపేతమైన నిర్ణయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరికొందరు విమర్శిస్తున్నారు. 2019 న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఎప్పటికి గుర్తుండిపోవాలనే కత్రినా ఇలా చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఫ్యామిలీతో కలసి

ఫ్యామిలీతో కలసి

కత్రినా కైఫ్ తన తల్లి, సోదరితో కలసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం వెస్ట్రన్ యూరప్ లోని ఇంగ్లిష్ ఛానల్ సముద్రం వద్దకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సముద్రంలోకి దిగడానికి పర్యాటకులు ఎవరూ సాహసించరు. కానీ అలాంటి సాహసాన్ని కత్రినా కైఫ్ తన తల్లి, సోదరితో కలసి చేసింది.

ముగ్గురూ బికినీల్లో

ఇంగ్లిష్ ఛానల్ సముద్రం వద్ద మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలో సాధారణంగా ఉండడమే కష్టం. అలాంటిది వీరు ముగ్గురూ బికినీ ధరించి ఈత కొట్టడానికి సముద్రంలోకి దిగారు. కత్రినా కైఫ్ సముద్రంలోకి దిగిన కొన్ని క్షణాలకే కేకలు పెడుతూ బయటకు వచ్చేసింది. ఎముకలు కొరికే చలిలో ఈత కొట్టలేక తల్లితో కలసి బయటకు వచ్చేసింది. కానీ కత్రినా సోదరి మాత్రం చాలా దూరం ఈదుకుంటూ సముద్రంలోకి వెళ్ళింది. ఈ వీడియోని కత్రినా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

 కలసిరాని 2018

కలసిరాని 2018

ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే 2018 ఈ మెరుపు తీగకు అంతగా కలసి రాలేదు. నటించిన రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. అమిర్ ఖాన్ సరసన నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం భారీ అంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. మ్యాజిక్ చేస్తుందనుకున్న జీరో కూడా బోల్తా కొట్టింది. 2018 లో కత్రినా రెండు భారీ పరాజయాల్ని మూటగట్టుకుంది.

 సల్మాన్ ఖాన్ పైనే ఆశలు

సల్మాన్ ఖాన్ పైనే ఆశలు

ఇదిలా ఉండగా కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు జోడిగా భారత్ చిత్రంలో నటిస్తోంది. అలీ అబ్బాస్ ఈ చిత్రానికి దర్శకుడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కత్రినా భారీ ఆశలే పెట్టుకుంది. కత్రినా, సల్మాన్ ఖాన్ జోడిపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల కత్రినాకు టైగర్ జిందా హై తప్ప సరైన విజయం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X