Just In
- 17 min ago
మళ్లీ జన్మంటూ ఉంటే మేయర్ కుక్కగా.. నా తల్లి కూడా అలాంటి ప్రేమను చూపించలేదు.. ఆర్జీవి ఎమోషనల్
- 42 min ago
కార్తీకేయ 2 కోసం బాలీవుడ్ నటుడు.. అదిరిపోయే అప్డేట్
- 1 hr ago
అవన్నీ తప్పుడు వార్తలే.. నా పర్మిషన్ లేకుండా.. సురేఖా వాణి స్వీట్ వార్నింగ్
- 1 hr ago
షాదీ ముబారక్ కలెక్షన్లు.. సాగర్ ఆర్కే నాయుడుపై తరగని ప్రేక్షకుల ఆదరణ!
Don't Miss!
- News
మోదీకి షాకిచ్చిన దీదీ -బీజేపీ లూటీ చేస్తోంది -ప్రధాని సభ వేళ ఎల్పీజీ ధరలపై బెంగాల్ సీఎం నిరసన
- Finance
8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.94 లక్షల కోట్లు జంప్
- Sports
అదే ఇంగ్లండ్ కొంపముంచింది.. దేశం కోసం ఆడేటప్పుడు దేనికైనా సిద్ధపడాలి: సునీల్ గవాస్కర్
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఘనంగా కత్రినా కైఫ్ పెళ్లి! అమితాబ్ దంపతుల హంగామా.. నాగార్జున స్పెషల్ అట్రాక్షన్
ఈ రోజుల్లో పెళ్లి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పెళ్లిళ్లయితే అంగరంగ వైభవంగా జరుగుతుండటం చూస్తున్నాం. ఇక ఈ వేడుకల్లో ఇతర సెలబ్రిటీల సందడి అంతా ఇంత ఉండదు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్ళిలో సరిగ్గా ఇదే జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అమితాబ్ ఓ సందేశం పోస్ట్ చేశారు. దీంతో ఈ పెళ్లిసంగతి జనాల్లో హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

పెళ్లి కూతురిగా కత్రినా కైఫ్.. అమితాబ్ దంపతుల హంగామా
అందాల తార కత్రినా కైఫ్ పెళ్లి కూతురిగా సుందరంగా తయారై పెళ్లిపీటలెక్కింది. ఈ వేడుకలో సౌత్ స్టార్స్ నాగార్జున, ప్రభు, శివ రాజ్‌కుమార్ సందడి చేయగా.. అమితాబ్ బచ్చన్ దంపతులు చిందులేస్తూ ఎంజాయ్ చేశారు. అందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులను హూషారెత్తించారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇది కత్రినా రియల్ మ్యారేజ్ కాదు.

అక్కినేని నాగార్జున, ప్రభు స్పెషల్ అట్రాక్షన్
ప్రముఖ జ్యూయెలర్స్ వ్యాపార సంస్థ అయిన కళ్యాణ్ జ్యూయెలర్స్ ఓ యాడ్ షూట్ చేసింది. ఇందుకోసమే హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి పీటలెక్కింది. కళ్యాణ్ జ్యూయెలర్స్ బ్రాండ్ అంబాసిడర్స్ అయిన అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, కత్రినా కైఫ్, అక్కినేని నాగార్జున, ప్రభు, శివ రాజ్‌కుమార్ ఇందులో పాల్గొన్నారు.

పెళ్లి దుస్తుల్లో కత్రినా.. తల్లిదండ్రుల దీవెన
ఈ యాడ్ షూట్‌లో ఓ పెళ్లి వేడుక క్రియేట్ చేసి పెళ్లికూతురుగా కత్రినా కైఫ్‌ని పెట్టేశారు. పెళ్లి దుస్తుల్లో ఆమెను అలంకరించి చూపరులను అట్రాక్ట్ చేశారు. ఈ షూట్‌లో కత్రినా తల్లిదండ్రులుగా అమితాబ్, జయ నటించారు. ఈ పెళ్లికి నాగార్జున, ప్రభు, శివ రాజ్‌కుమార్ ముఖ్యఅతిథులుగా విచ్చేసినట్లు చిత్రీకరించారు.
|
ఆనందంగా ఉందంటూ అమితాబ్ ట్వీట్
అయితే ఈ షూట్‌లో భాగంగా నాగార్జున, ప్రభు, శివ రాజ్‌కుమార్‌లతో దిగిన ఫొటోను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ముగ్గురు సౌత్ స్టార్లను ఒకేసారి కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు తనకు, జయకు ఇదొక చారిత్రాత్మక క్షణం అని ఆయన తెలపడం విశేషం.
|
ఇది గొప్ప గౌరవం.. ఆ ముగ్గురూ మాతో కలిసి
‘‘జయకు, నాకు ఇదొక చారిత్రాత్మక క్షణం. భారత చలనచిత్ర పరిశ్రమలోని ముగ్గురు దిగ్గజాల కొడుకులైన ముగ్గురు సూపర్ స్టార్లు మాతో కలిసి పనిచేశారు. ఇది గొప్ప గౌరవం.
నాగార్జున - అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు (తెలుగు)
శివ రాజ్‌కుమార్ - డాక్టర్ రాజ్‌కుమార్ కుమారుడు (కన్నడ)
ప్రభు - శివాజీ గణేశన్ (తమిళ్) కుమారుడు'' అని అమితాబ్ తన ట్వీట్‌లో వెల్లడించారు.