కరోనాతో యువ నిర్మాత మృతి.. కియారా అద్వానీకి షాక్.. శోక సంద్రంలో సినీ ప్రముఖులు
ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్ దేశవ్యాప్తంగా ఎంతో మందిని పొట్టనబెట్టుకొంటున్నది. సినీ పరిశ్రమకు తీరని వేదనను కలిగిస్తున్నది. ఎప్పటికే ఎంతో మందిని బలి తీసుకొన్న కరోనావైరస్ తాజాగా నిర్మాత ర్యాన్ ఇవాన్ స్టీఫెన్‌ను కబలించింది. యువ నిర్మాత మరణంతో కియారా అద్వానీ, వరుణ్ ధావన్‌తోపాటు పలువురు సిని ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. ఆ వివరాల్లోకి వెళితే...

బాలీవుడ్ యువ నిర్మాతగా
యువ నిర్మాత ర్యాన్ ఇవాన్ స్టీఫెన్ విషయానికి వస్తే.. కరణ్ జోహర్ సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో చాలా కాలం ర్యాన్ పనిచేశారు. ఇటీవల ఇందూ కి జవానీ, దేవీ లాంటి చిత్రాలను నిర్మించారు. అభిరుచి గత యువ నిర్మాతగా ర్యాన్ ఇవాన్‌కు మంచి పేరు, గుర్తింపు ఉంది.

20 రోజులుగా కరోనావైరస్‌తో పోరాడుతూ
ఎంతో ప్రతిభావంతుడిగా నిరూపించుకొంటున్న నిర్మాత ర్యాన్ ఇవాన్ స్టీఫెన్ ఇటీవల కరోనావైరస్ బారిన పడ్డారు. కోవిడ్ 19 పాజిటివ్ అని తేలిన తర్వాత ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. గత 20 రోజులుగా హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతూ.. మే 29వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు.

వరుణ్ ధావన్ సంతాపం
నిర్మాత ర్యాన్ ఇవాన్ స్టీఫెన్ ఇక లేరనే వార్తతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ర్యాన్ ఇవాన్ ఇకలేరనే విషయాన్ని వరుణ్ ధావన్ జీర్ణించుకోలేకపోయారు. ర్యాన్ ఆత్మకు శాంతి కలగాలని ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టి తన శ్రద్దాంజలి ఘటించారు.

తీవ్ర దిగ్బ్రాంతిలో కియారా అద్వాని
నిర్మాత ర్యాన్ మరణ వార్తను హీరోయిన్ కియారా అద్వానీ తట్టుకోలేకపోయారు. నాకు అత్యంత సన్నిహితుడైన ర్యాన్ ఇంత త్వరగా ఈ లోకాన్ని వీడుతారని అనుకోలేదంటూ ఎమోషనల్ అయ్యారు. ర్యాన్ నిర్మించిన ఇందూ కీ జవానీ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. తనతో అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ దిగ్బ్రాంతికి గురయ్యారు.
Recommended Video

షాక్‌లో మనోజ్ బాజ్‌పేయ్
తన స్నేహితుల ద్వారా ర్యాన్ మరణ వార్తను తెలుసుకొన్న నటుడు మనోజ్ బాజ్‌పేయ్ ట్విట్టర్‌లో స్పందించారు. అద్బుతమైన మనసు ఉన్న వ్యక్తి లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. ఈ వార్త వాస్తవం కాదంటే బాగుండు. నా స్నేహితుడు ర్యాన్ మరణం నాకు తీరని లోటు అంటూ మనోజ్ బాజ్‌పేయ్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











