For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మూడేళ్లు సహజీవనం చేశా.. అలా సన్నిహితంగా ఉన్నాం.. బ్రేకప్‌పై పెదవి విప్పిన స్టార్ హీరో కూతురు!

  |

  బాలీవుడ్‌ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టకుండానే ఏ హీరోయిన్‌కు దక్కని ఫాలోయింగ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణా ష్రాఫ్‌కు దక్కింది. స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌ సోదరిగా ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. సోషల్ మీడియాలో బికినీ, హాట్ హాట్ స్టిల్స్‌తో హంగామా చేస్తున్నది. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తన తొలి ప్రేమ గురించి అనేక విషయాలు పంచుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే..

  మ్యూజిక్ వీడియోతో కెరీర్

  మ్యూజిక్ వీడియోతో కెరీర్

  కృష్ణా ష్రాఫ్‌ విషయానికి వస్తే.. స్వతంత్ర భావాలు కలిగిన ఆధునిక యువతి అని చెప్పవచ్చు. అయితే పలుమార్లు అదే విషయాన్ని ప్రస్తావించారు. తన జీవితం, కెరీర్ మీద తన కుటుంబ ప్రభావం పడటం తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేసింది. తన తండ్రి, సోదరుడి అడుగు జాడల్లో నడవను అంటూ స్పష్టం చేసింది. ఇటీవల ఓ కిన్ని కిన్ని వారీ అనే పంజాబీ సాంగ్‌లో రిషీసూద్‌తో ఓ మ్యూజిక్ వీడియోలో నటించింది.

  గ్లామర్ ట్రీట్‌లో హద్దు దాటేసిన నాని హీరోయిన్: ఓ రేంజ్‌లో అందాల ఆరబోతతో సెగలు రేపుతోన్న బ్యూటీ

  లవ్ బ్రేకప్ గురించి

  లవ్ బ్రేకప్ గురించి

  అయితే మ్యూజిక్ వీడియో ప్రమోషన్‌ సందర్భంగా తన లవ్ బ్రేకప్ గురించి చెబుతూ..
  నేను పీకల్లోతు రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. నాకు 20 సంవత్సరాల వయసులో నేను ప్రేమలో పడ్డాను. మేమిద్దరం మూడేళ్ల పాటు అఫైర్‌ కొనసాగించాం. అదే నాకు ఫస్ట్ లవ్. దాంతో మేమిద్దరం కొంచెం సన్నిహితంగా మెదిగాం. ఇద్దరం సహజీవనం చేశాం అని కృష్ణా ష్రాఫ్ చెప్పారు.

  బ్రేకప్‌తో హృదయం ముక్కలైంది

  బ్రేకప్‌తో హృదయం ముక్కలైంది


  సహజీవనంలో ఉన్నప్పుడు ప్రపంచమంతా చుట్టి వచ్చాం. కలిసి పనిచేశాం. అయితే మా మధ్య అనుకోకుండా బ్రేకప్ జరిగింది. మా రిలేషన్‌కు గుడ్‌బై చెప్పాను. అతడు, నేను కలిసి పెరిగాం కాబట్టి మా మధ్య అంతగా విభేదాలు లేవు. దాంతో మేము సానుకూలంగా విడిపోయాం. మా దారులు మేము వెతుక్కొన్నాం. అదే నాకు జీవితంలో పెద్ద గుండె కోత. నాకు నేను తమాయించుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాను అని కృష్ణా ష్రాప్ పేర్కొన్నారు.

  జీవితం గాడిలో పడటానికి

  జీవితం గాడిలో పడటానికి

  నాకు ఇష్టమైన వ్యక్తితో బ్రేకప్ జరిగిన తర్వాత జీవితం గాడిలో పడటానికి చాలా సమయం పట్టింది. మానసికంగా ధృడంగా ఉండటంతో ఆ ఫీలింగ్‌ నుంచి త్వరగా బయటపడ్డాను. ఆ తర్వాత నన్ను, నా జీవిత గమనానికి ఏదీ అడ్డుపడలేదు. ఆ తర్వాత మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటానికి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాను. ఆ తర్వాత నా జీవితమే మారిపోయింది. ఆ అనుభవం జీవితానికి సరిపడా గుణపాఠం నేర్పింది అని కృష్ణా ష్రాప్ పేర్కొన్నారు.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  బాలీవుడ్‌లోకి అడుగు పెట్టను

  బాలీవుడ్‌లోకి అడుగు పెట్టను

  తన కెరీర్‌పై కృష్ణా ష్రాఫ్ స్పష్టమైన వైఖరితో ఉన్నారు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా, నటిగా మారడం నాకు ఇష్టం లేదు. బాలీవుడ్‌లోకి నేను అడుగుపెట్టాను. మ్యూజిక్ రంగంలో స్థిరపడాలని అనుకొంటున్నాను. బాలీవుడ్ కంటే మరోటి ఏదైనా ఉండాలని అనుకొంటున్నాను అని కృష్ణా ష్రాఫ్ తన ప్లాన్స్ చెప్పారు.

  English summary
  Bollywood Super Star Jackie Shroff daughter Krishna Shroff reveals her first break up after three years of Living relationship. She said We moved in together, we lived together, traveled the world together, worked together.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X