Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
స్వర్గంలా ఉంది, ప్రియుడితో రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన ‘సాహో’ నటుడి కూతురు!
ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించి పాపులర్ అయిన తాజాగా విడుదలైన 'సాహో'లో ప్రభాస్ తండ్రి పాత్రలో కనిపించారు. జాకీ ష్రాఫ్ వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కూతురు కృష్ణ ష్రాఫ్ మాత్రం సినిమా రంగాన్ని తన కెరీర్‌గా ఎంచుకోలేదు. సినిమాల్లో నటించడం కంటే ఇతర వ్యాపారాల్లో రాణిస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేయడంపైనే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తూ
తాజాగా కృష్ణ ష్రాఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన పిక్ హాట్ టాపిక్ అయింది. బాయ్ ఫ్రెండ్ ఎబాన్ హైమ్స్‌తో రొమాన్స్ చేస్తూ అందులో కనిపించారు. ఏ విషయంలో అయినా ఓపెన్‌గా ఉండే కృష్ణా ష్రాఫ్ తన ప్రియుడిని ప్రపంచానికి చూపించడానికి ఏమాత్రం సంకోచించరు.

మా పని మేము చేసుకుంటున్నాం
రొమాంటిక్ ఫోటో షేర్ చేయడం మాత్రమే కాదు.... దానికి అందరూ ఆశ్చర్యపోయే క్యాప్షన్ కూడా పెట్టారు. ‘మా సొంత కంపెనీలా చూసుకుంటూ మా పని మేము చేసుకుంటున్నాము. ఇది విధి.. మేము అలాగే ఉన్నాం. ఇది చాలా ప్రత్యేకమైనది, స్వర్గంలా ఉంది' అంటూ కామెంట్ పెట్టారు.

ఎబాన్ హైమ్స్
ఎబాన్ హైమ్స్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు, అతను ఆస్ట్రేలియన్ నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయుడు. ప్రస్తుతం యుబిఎ (యునైటెడ్ బాస్కెట్‌బాల్ అలయన్స్) ప్రో బాస్కెట్‌బాల్ లీగ్‌లో హర్యానా గోల్డ్ జట్టు కోసం ఆడుతున్నాడు.

ఇద్దరూ ప్రేమలో
ఎబాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కృష్ణా ష్రాఫ్ రొమాంటిక్ పోస్ట్‌ను షేర్ చేసి, "కపుల్ మోర్. #గాడ్స్‌ప్లాన్" అని రాశారు. అతను తమను 'కింగ్' అండ్ 'క్వీన్' అని పేర్కొంటూ మరొక చిత్రాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. కృష్ణా ష్రాఫ్... ఎబాన్‌తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇద్దరూ తరచూ ఒకరి ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో మరొకరి గురించి ఏదోఒకటి పేర్కొంటూనే ఉంటారు.