అద్దె గర్భంతో తల్లిగా మహేష్ బాబు హీరోయిన్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తెలుగులో మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కినా.. టాలీవుడ్‌లో కలిసి రాలేదు. దాంతో హిందీ చిత్ర పరిశ్రమపైనే ఆశలు పెట్టుకొన్నది. గ్లామర్ పాత్రలతోపాటు నటనకు స్కోప్ ఉన్న రోల్స్‌తో ఆకట్టుకొంటున్నారు. తాజాగా తన ఇమేజ్‌కు భిన్నంగా మిమి అనే చిత్రంలో అద్దె గర్భం (సర్రోగేట్ మదర్ ) తల్లిగా ఓ విభిన్న పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆమెపై చిత్రీకరిస్తున్న సీన్లు లీకై సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
కృతి సనన్ గర్భవతిగా కూర్చొని ఉన్న ఫోటో మీడియాలో వైరల్ అయింది. గర్భంతో ఉన్న కృతి ఫోటో ఆసక్తిని రేపుతున్నది. గ్లామర్ హీరోయిన్ ఇలా గర్భవతిగా నటించడమేమిటని అభిమానులు, సినీ ప్రేక్షకులు సోషల్ మీడియాలో సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మిమి చిత్రం మరాఠీలో ప్రేక్షకాదరణ పొందిన మాలా ఆయ్ వయ్‌చీ అనే సినిమా ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని మరాఠీ భాషలో సమృద్ధి పోరే దర్శకత్వం వహించగా జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ రూపొందిస్తుండగా.. దినేష్ విజన్ నిర్మిస్తున్నారు.
అద్దె గర్భం తల్లి పాత్ర కోసం కృతి 15 కేజీల బరువు పెరిగింది. మిమిలో విభిన్నమైన పాత్ర కోసం గర్భవతులను కలిసి వారి కష్టా సుఖాలను కూడా తెలుసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ.. ఇంత రేంజ్‌లో బరువు పెరగడం నా దేహానికి ఇదే కొత్త. తక్కువ కాలంలో ఎక్కువ కాలరీలు తీసుకొని బరువు పెరగడం ఓ ఛాలెంజ్‌గా మారింది. నా దేహాన్ని అలాంటి పరిస్థితులుకు అలవాటు చేయడం చాలా కష్టమైంది అని కృతి సనన్ అన్నారు.


Click it and Unblock the Notifications











