‘సాహో’ ప్లాప్ అంటూ నెగెటివ్ ప్రచారం... డబ్బు తీసుకుని ఇపుడు మాట మార్చాడా?
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ మూవీ 'సాహో'. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో యూవి క్రియేషన్స్ వారు నిర్మించారు. సౌత్ ఇండియా మార్కెట్‌తో పాటు బాలీవుడ్ మార్కెట్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కింది.
ఇటీవల విడుదలైన 'సాహో' టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న తరుణంలో బాలీవుడ్ వివాదాస్పద నటుడు, నిర్మాత, క్రిటిక్ కమల్ రసీద్ ఖాన్(కెఆర్‌కె) ఈ చిత్రం ప్లాప్ అంటూ నెగెటివ్ ప్రచారం మొదలు పెట్టాడు. అయితే ఈ విషయంలో తాజాగా కెఆర్‌కె మాట మార్చడం గమనార్హం.

ప్లాప్ అంటూ ఆరోజు అలా...
‘సాహో' టీజర్ విడుదలైన రోజు ‘కెఆర్‌కె' స్పందిస్తూ... ‘సాహో టీజర్ వీడియో గేమ్‌లా ఉంది. ఈ 300 కోట్లు సూపర్ బడ్జెట్ మూవీ బాక్సాఫీసు వద్ద ప్లాప్ అవ్వడం ఖాయం' అంటూ ట్వీట్ చేశాడు. కెఆర్‌కె చేసిన ఈ ట్వీటుపై ప్రభాస్ అభిమానులు తీవ్రంగా స్పందించారు.
అతడు ప్లాప్ అంటే సినిమా హిట్టే...
గతంలో కూడా కెఆర్‌కె బాహుబలి విషయంలో ఇలాగే నెగెటివ్ ప్రచారం చేశాడు. కానీ బాహుబలి ఎలాంటి విజయం సాధించిందో భారత దేశం మొత్తానికి తెలుసు, అతని మాటలు పట్టించుకోవద్దని కొందరు సూచించారు. కెఆర్‌కె ప్లాప్ అన్నాడంటే... అది తప్పకుండా హిట్ అవుతుందని చెప్పుకొచ్చారు.
సినిమా హిట్ అంటూ మాట మార్చాడు
అయితే ఇపుడు కెఆర్‌కె ‘సాహో' విషయంలో మాట మార్చాడు. ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని, ప్రభాస్ బాలీవుడ్లో పెద్ద స్టార్ అవుతాడు అంటూ ట్వీట్ చేశాడు. సౌతిండియాలో పాపులర్ అయిన ఒక సూపర్ స్టార్ బాలీవుడ్ ఇండస్ట్రీకి దక్కడం మంచి పరిణామం అంటూ పేర్కొన్నారు.
డబ్బు తీసుకుని మాట మార్చాడా?
కెఆర్‌కె ట్వీట్ చూసిన చాలా మంది.... డబ్బు తీసుకుని ‘సాహో' విషయంలో మాట మార్చాడని కామెంట్ చేయడం మొదలు పెట్టారు. దీనిపై అతడు స్పందిస్తూ... ‘చాలా మంది నేను డబ్బు తీసుకుని నా అభిప్రాయం మార్చుకున్నట్లు భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. ‘సాహో' విషయంలో సర్వే రిజల్ట్ చూసిన తర్వాత నా మనసు మార్చుకున్నా. నా వరకు సాహో టీజర్ అనేది వీడియో గేమ్. ప్రజలకు అది నచ్చితే హిట్ అవుతుంది. నేను ఎప్పుడూ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తాను అన్నారు.

సాహో
‘సాహో' మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్‌తో పాటు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో సందడి చేయబోతున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











