Lata Mangeshkar ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆందోళనకరంగా బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ప్రకటన

భారత దిగ్జజ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గతనెల రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గతనెల డిసెంబర్ కోవిడ్‌తోపాటు న్యుమెనియా వ్యాధితో కారణంగా హాస్పిటల్‌లో చేరారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంటూ వచ్చింది. కానీ గత రెండు రోజులుగా లత మంగేష్కర్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్నది. దాంతో ఆమె ఆరోగ్యం విషమంగా మారింది అని వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇధిలా ఉండగా, బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వర్గాలు వెల్లడించిన ప్రకారం.. లతా మంగేష్కర్ ఆరోగ్యం మరోసారి విషమంగా మారింది. ఆమెను వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం అని డాక్టర్ ప్రతిత్ సంధాని వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో లతను అబ్జర్వేషన్‌లో ఉంచాం. గతవారం ఆమెకు వెంటిలెటర్ తొలగించాం. కానీ ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి మరోసారి దిగజారింది అని తెలిపారు.

 Lata Mangeshkar health condition deteriorated again: Breach Candy Hospital

అయితే లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. లత ఆరోగ్యం గురించి, ఆమె గురించి మీడియాలో అసత్య ప్రచారం జరుగుతున్నది. దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని కోరారు.

ఇక లతా మంగేష్కర్ కెరీర్ విషయానికి వేస్తే.. 1949లో కెరీర్ ఆరంభించారు. హిందీలో వేలాది పాటలు పాడారు. అంతేకాకుండా అనే భారతీయ భాషల్లోను, విదేశీ భాషలో కూడా అనేక పాటలు పాడారు. ముఖ్యంగా మరాఠీ, హిందీ, బెంగాలీ భాషల్లో ఎక్కువగా తన పాటలను ఆలపించారు. సినీ పరిశ్రమకు చేసిన సేవల గుర్తుగా లతా మంగేష్కర్ కేంద్ర ప్రభుత్వం పలు అవార్డులతోపాటు భారత రత్నను కూడా ప్రధానం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X