TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
నా కూతుర్ని గదిలోకి తీసుకెళ్లి.. ఒప్పుకోకపోవడంతో అలా జరిగింది.. అసభ్యంగా అంటూ ప్రియాంక తల్లి..

లైంగిక వేధింపులను బయటపెడుతూ మీటూ ఉద్యమం ఊపందుకోవడం బాలీవుడ్‌ను కంగారుపెట్టింది. పలువురు నటులు, డైరెక్టర్లు, గాయకులు ఈ వివాదంలో చిక్కుకొన్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖులుగా పేరొందని వారంతా ఈ వివాదంలో కూరుకుపోవడం బాలీవుడ్ ప్రతిష్ఠమసకబారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వేధింపులు ప్రియాంక చోప్రాకు కూడా ఎదురయ్యాయని ఆమె తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రియుడు నిక్ జోన్స్‌తో వివాహం తర్వాత ప్రియాంక చోప్రాకు జరిగిన లైంగిక వేధింపులు, అవమానాలపై ఆమె తల్లి నోరు విప్పడం మరోసారి ఈ వివాదం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..
మిస్ వరల్డ్‌గా ఎన్నికైన తర్వాత కూడా
నా కూతురు పరిశ్రమలోకి ప్రవేశించిన తొలినాళ్లలో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నది. మిస్ వరల్డ్‌గా ఎంపికైనప్పటికీ ఆమెకు లైంగిక వేధింపులు తప్పలేదు. కానీ వాటన్నిటినీ ధైర్యంతో, పూర్తి విశ్వాసంతో ప్రియాంక ఎదుర్కొన్నారు అని ప్రియాంక తల్లి మధు చోప్రా వెల్లడించారు.
ఓ భయంకర సంఘటనతో
ప్రియాంక చోప్రాకు 17 ఏళ్ల వయసులో ఓ భయంకర సంఘటన ఎదురైంది. సినిమా అవకాశం ఇప్పిస్తాను. నీవు ఒంటరిగా వచ్చి కలుసుకోమని ఓ వ్యక్తి మెసేజ్ చేశారడు. ఆ తర్వాత ఆడిషన్‌కు వెళితే నన్ను బయట కూర్చొపెటట్టి.. కథ చెబుతాను అని చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు.
గదిలోకి రమ్మని చెప్పి
ఒకవేళ కథ మాత్రమే చెప్పడానికైతే నన్ను ఎందుకు గదిలోకి రాకుండా ఆపాడో అర్థం కాలేదు. నేను కూడా ఉంటే ఇబ్బంది అవుతుందని నన్ను బయటనే ఉంచేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి నిర్వాకం వల్ల దాంతో ప్రముఖ బ్యానర్లో రూపొందే ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది అని ప్రియాంక తల్లి మధు చోప్రా వెల్లడించారు.
అసభ్యకరమైన డ్రస్సులు ఇచ్చి
మరోసారి ఓ సినీ ప్రముఖుడు అసభ్యకరమైన డ్రస్ ఇచ్చి వేసుకోమన్నాడు. అందుకు నిరాకరించడంతో దాదాపు 10 సినిమాలు కోల్పోయింది. మరో డైరెక్టర్ కూడా ఇలాంటి నిర్వాకమే చేశాడు. మిస్ వరల్డ్ లాంటి ప్రియాంక అందాలు చూపించడానికి అసభ్యంగా నటించాల్సిన అవసరం ఉందా? అని మధు చోప్రా ప్రశ్నించారు.
లుక్ అదిరిపోయింది: ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ ముంబై వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోస్)
టాలెంట్‌ను మాత్రమే నమ్ముకొని
ఇలా పలువురు సినీ ప్రముఖుల వేధింపుల వల్ల చాలా ఆఫర్లు ప్రియాంక కోల్పోయింది. అయిత ఏనాడు తన మనోస్థైర్యాన్ని ఆమె కోల్పోలేదు. పాత్ర డిమాండ్ కోసం అవసరమైతే అందులో తప్పేమీ లేదు. కానీ వేధింపుల లక్ష్యంగా ఇలాంటి చేస్తే ఎవరూ ఊరుకోలేదు. ప్రియాంక టాలెంట్‌ను నమ్ముకొన్నారే తప్పా.. ఆఫర్ల కోసం ప్రియాంక ఎన్నడూ దిగజారలేదు.