twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరద బాధితులకు జెనీలియా-రితేష్ దేశ్‌ముఖ్ రూ. 25 లక్షల విరాళం

    |

    కుండపోత వర్షాల కారణంగా వరదలు రావడంతో మహారాష్ట్రల్లోని కొల్హాపూర్, సాంగ్రి జిల్లాల్లో పరిస్థితి మరీ భయానకంగా మారింది. భారీ సంఖ్యలో జనం నిర్వాసితులయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

    వరద బాధితుల కోసం సినీ ప్రముఖులు తమవంతుగా సహాయం అందిస్తున్నారు. తాజాగా నటి జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ దంపతులు వరద బాధితుల కోసం రూ. 25 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.

     Maharashtra floods: Riteish and Genelia Deshmukh Rs 25 lakh contribution

    ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ దంపతులు చెక్కు అందిస్తున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. వరద బాధితుల కోసం రూ. 25 లక్షలు సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

    890 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 100 టిఎంసి సామర్ధ్యంతో కూడిన భారీ కోయానా డ్యాం ఈ ఏడాది కేవలం తొమ్మిది రోజుల్లో సగం లేదా అంతకంటే ఎక్కువగా 50 టిఎంసిలతో నిండిపోయింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 432 తాత్కాలిక సహాయ శిబిరాలకు వరద బాధిత సాంగ్లి, కొల్హాపూర్, సతారా జిల్లాల నుంచి 3.78 లక్షల మందిని తరలించారు.

    English summary
    "Thank you Riteish and Genelia Deshmukh for the contribution of Rs 25,00,000/- (Rs 25 lakh) towards CM Relief Fund for Maharashtra floods," Chief Minister Devendra Fadnavis has thanked the actor couple of Riteish and Genelia Deshmukh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X