Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కంగన సిస్టర్స్‌కు ముంబై కోర్టు షాక్.. ‘రేప్’ కేసులో ఎదురుదెబ్బ
బాలీవుడ్‌లో గత కొద్దికాలంగా వివాదాలతోపాటు, సోషల్ మీడియాలో విరుచుకుపడిన హీరోయిన్ కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్‌కు షాక్ తగిలింది. నటుడు ఆదిత్య పంచోలి, ఆయన భార్య జరీనా వాహబ్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరుకావాలని కంగన సిస్టర్స్‌కు కోర్టు నోటీసులు పంపింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కంగన ఎలా రియాక్ట్ అవుతుందనే విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి అసలు కారణమేమిటంటే..

కంగనను రేప్ చేశారంటూ
కొద్దిరోజుల క్రితం కంగన సోదరి రంగోలి చండేల్ సోషల్ మీడియాలో ఆదిత్య పంచోలిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కంగనను గృహ నిర్బంధం చేసి, లైంగికంగా దాడి చేశారు. అంతేకాకుండా తన అక్కపై మానభంగం కూడా జరిపాడు. ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్పలేం అనే విధంగా రంగోలి ట్వీట్ చేసింది. దాంతో ఆదిత్య పంచోలి దంపతులు వారిపై పరువు నష్టం దావా వేశారు.

ఆదిత్య పంచోలి దంపతులు పిటిషన్లు
ఆదిత్య పంచోలి దంపతులు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లను దాఖలు చేశారు. కంగనకు సంబంధించిన ఇంటర్వ్యూలు, టెలివిజన్ షో ఇంటర్వూలు, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చేసుకొని దావా వేశారు. ఆదిత్య పంచోలి దంపతులు దాఖలు చేసిన పటిషన్లను స్వీకరించిన ముంబై చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎస్‌బీ దిఘే విచారణకు చేపట్టారు. కంగన, రంగోలికి వేర్వేరుగా సమన్లు పంపారు.

కంగన రనౌత్ సోదరి ఆరోపణలపై
కంగనకు కోర్టు సమన్లు పంపిన నేపథ్యంలో ఆదిత్య పంచోలి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తనను గృహనిర్బంధం చేశాడు. అందుకే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదదు చేశామని కంగన ఆరోపించింది. అయితే ఆదిత్యపై ఎలాంటి కేసు గానీ, ఎఫ్ఐఆర్ గానీ నమోదు కాలేదు. ఆరోపణలు తన క్లయింట్ పరువు దెబ్బ తీసే విధంగా ఉంది అని న్యాయవాది పేర్కొన్నారు.

జూలై 26న కోర్టుకు రావాలని
కంగన సోదరి రంగోలి చండేల్ చేసిన సోషల్ మీడియా పోస్టులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. లైంగిక వేధింపుల కేసులో 2005-2006 మధ్య ఆదిత్య పంచోలిపై ఎఫ్ఐఆర్ నమోదైంది అని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు అని న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 26న జరుగనున్నది. వారిద్దరిని కోర్టుకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నాం అని పేర్కొన్నారు.