Don't Miss!
- News
సరిహద్దు రాష్ట్రాల్లో బలంగా ఉన్నచోటే.. కేసీఆర్ సభల వెనుక అంతర్యం ఇదే!!
- Automobiles
అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న TVS iQube: ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం..
- Lifestyle
Chanakya Niti: ఈ వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగొద్దు, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది
- Finance
Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. అది తగ్గటమే కారణమా..?
- Sports
IND vs NZ: స్టార్ స్పోర్ట్స్‌పై మండిపడ్డ రోహిత్ శర్మ.. ఎందుకంటే?
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Akhanda హిందీ రిలీజ్.. ట్రైలర్ అదిరింది కానీ.. అదొక్కటే సమస్య?
టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యధిక స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందించిన సినిమా అఖండ. ఇక ఈ సినిమాను ఇప్పుడు హిందీలో కూడా విడుదల చేయడానికి రెడీ అయ్యారు. RRR సినిమాను హిందీలో విడుదల చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ అఖండ సినిమాను హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.
ఇక లేటెస్ట్ గా ఒక సాలిడ్ ట్రైలర్ను కూడా విడుదల చేయడం జరిగింది తెలుగు ట్రైలర్ కు కాస్త భిన్నంగా ఉన్నాయి. ట్రైలర్లో అంతా బాగానే ఉంది కానీ ఒకే ఒక్క సమస్య మాత్రం ఫాన్స్ ను కొంత కలవరపెడుతోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇక హిందీలో కూడా టాలీవుడ్ సినిమాలకు మంచి క్రేజ్ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హిందూత్వం బ్యాక్ డ్రాప్ సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

కార్తికేయ 2 సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాకుండా సీతారామం టైటిల్ కూడా అక్కడ వర్క్ అవుట్ అయింది. ఆ సినిమాకు హిందీలో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు అఖండ సినిమాను జనవరి 20న విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. అయితే హిందీ ట్రైలర్ లో మాత్రం నందమూరి బాలకృష్ణకు సంబంధించిన డబ్బింగ్ విషయంలో ఫ్యాన్స్ కొత్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నందమూరి బాడీ లాంగ్వేజ్ కు ఇంకాస్త పవర్ఫుల్ డబ్బింగ్ చెప్పే వారిని ఫైనల్ చేసి సెట్ చేసి ఉంటే బాగుండేది అని ఆయన బాడీ లాంగ్వేజ్ కు ఆ వాయిస్ ఏమాత్రం సెట్ అవ్వలేదు అని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక హిందీలో మొదట కొన్ని లిమిటెడ్ థియేటర్లలో విడుదల చేయబోతున్న పెన్ స్టూడియోస్ మంచి టాక్ తెచ్చుకున్న తర్వాత థియేటర్ల సంఖ్యను పెంచాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.