రియా చక్రవర్తి! నీవు మహానటివే కావొచ్చు.. మా వద్ద ఆ రేంజ్ యాక్టింగ్ వద్దు.. ఎన్సీబీ 55 ప్రశ్నలతో షాక్
బాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తితో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ అధికారులు విచారణ జరుగుతున్నది. గత కొద్ది రోజులుగా దాదాపు 55 ప్రశ్నలతో కూడిన జాబితాను సిద్ధం చేసి పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారులు హ్యూమరస్‌గా అడిగినట్టు మీడియాలో వెలుగు చూసిన ప్రశ్న ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ప్రశ్న ఏమిటంటే..

కస్టడీలో రియాను ప్రశ్నిస్తున్న ఎన్సీబీ
సుశాంత్ రాజ్ సింగ్ మరణం వెనుక వాస్తవాలను వెలికి తీయడానికి చేపట్టిన సీబీఐ, ఈడీ దర్యాప్తులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చింది. దాంతో ఎన్సీబీని రంగంలోకి దించి బాలీవుడ్‌తో ఉన్న డ్రగ్స్ రాకెట్ సంబంధాలను బయటపెట్టారు. ఆ క్రమంలో డ్రగ్ సప్లయిదారులతో రియా చక్రవర్తికి ఉన్న సంబంధాలను వెలికి తీసి ఆమెను అరెస్ట్ చేశారు. కస్టడీలో ఆమెను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

55వ ప్రశ్నతో రియాకు షాక్
డ్రగ్స్ కేసులో అరెస్టై ముంబైలో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న రియా చక్రవర్తి కోసం 55కి పైగా ప్రశ్నలతో కూడిన జాబితాను రూపొందించారు. ఆ జాబితాలోని 55వ ప్రశ్నగా.. నీ ఎంత మంచి నటివి? అనే ప్రశ్నను సంధించారు. అయితే అందుకు నేను మంచి చాలా మంచి నటిని అంటూ సమాధానం ఇచ్చింది అని రిపబ్లిక్ టీవీ కథనాన్ని ప్రచురించింది.

మహానటివే కావొచ్చు.. మా వద్ద యాక్టింగ్ వద్దు
అయితే నీవు మహానటివే కావోచ్చు. కానీ నీవు యాక్టింగ్ చేయడానికి ఇది సమయం కాదు. డ్రగ్స్ వాడావా? లేదా? చెప్పమని ఎన్సీబీ అధికారులు ప్రశ్నించగా... నేను ఉపయోగించలేదు అని రియా నుంచి సమాధానం వచ్చింది. అయితే నీవు డ్రగ్స్ తీసుకోకపోతే.. సప్లయర్ అని భావించాల్సి వస్తుంది. అది ఉపయోగించిన దాని కంటే ఎక్కువగా పెద్ద కేసు అవుతుంది అని రియాను ఎన్సీబీ అధికారులు హెచ్చరించినట్టు రిపబ్లిక్ టీవీ తన కథనంలో వెల్లడించింది.
Recommended Video

సుశాంత్, దిశ సలియాన్ మరణాలపై
బైకుల్లా మహిళా జైలులో ఉన్న రియా చక్రవర్తికి సెప్టెంబర్ 22వ తేదీ వరకు కస్టడీ ఉంది. ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ సిబ్బంది శ్యామూల్ మిరాండా, దీపేశ్ సావంత్ సెప్టెంబర్ 29వ తేదీ వరకు కస్టడీలో ఉంటారు. ఇదిలా ఉండగా, సుశాంత్, దిశా సలియాన్ మరణాలకు లింక్ ఏదైనా ఉందా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. జూన్ 8వ తేదీ రాత్రి సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











