RRR డిజాస్టర్.. తప్పుడు కలెక్షన్లు అంటూ క్రిటిక్ ట్వీట్.. చీల్చిచెండాడిన నెటిజన్లు

RRR చిత్రం విడుదలైన ప్రతీ చోట అఖండమైన జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ప్రేక్షకులను, సినీ విమర్శకులను మెప్పిస్తూ రెండో వారంలోకి ప్రవేశించింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత హిందీ సినీ పరిశ్రమకు సంబంధించిన క్రిటిక్, దర్శకుడు కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. అయితే సినిమా బ్లాక బస్టర్ దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో కమల్ ఆర్ ఖాన్‌ను నెటిజన్లు ట్రోల్స్‌తో చీల్చి చెండాడుతున్నారు. ఇంతకు కమల్ ఆర్ ఖాన్ ఏమని కామెంట్ చేశారంటే..

కమల్ ఆర్ ఖాన్ తొలి ట్వీట్

కమల్ ఆర్ ఖాన్ తొలి ట్వీట్

RRR గురించి కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేస్తూ.. తొలివారం కలెక్షన్లను పరిశీలిస్తే.. RRR చిత్రం ఈ దశాబ్దంలోనే అతిపెద్ద డిజాస్టర్. బాహుబలి1, బాహబలి2 బడ్జెట్‌తో పోల్చుకొంటే.. RRR సినిమా బడ్జెట్ రెండింతలు ఎక్కువ. కానీ బాహుబలి2 లైఫ్‌టైమ్ బిజినెస్‌తో పోల్చుకొంటే 40 శాతం తక్కువ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

కమల్ ఆర్ ఖాన్ రెండో ట్వీట్

కమల్ ఆర్ ఖాన్ రెండో ట్వీట్

RRR మూవీ గురించి కేఆర్కే అంతటితో ఆగలేదు. మరింత రెచ్చిపోయి కామెంట్ చేస్తూ.. RRR సినిమాను పబ్లిక్ నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించారు. కానీ సినిమా దర్శక, నిర్మాతలు ఫేక్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మీడియాను కొనేసి ఫేక్ రిపోర్టులు పెడుతున్నారు. నా నెక్ట్స్ రివ్యూలో ఈ సినిమా డిజాస్టర్ అని మరోసారి నిరూపిస్తాను. 680 కోట్లు ఎలా వచ్చాయనే పబ్లిక్ తెలియజేస్తాను అని కేఆర్కే ట్వీట్‌లో పేర్కొన్నారు.

కేఆర్కే దేశద్రోహి అంటూ

కేఆర్కే దేశద్రోహి అంటూ

అయితే కేఆర్కే ట్వీట్ పెట్టగానే.. నెటిజన్లు ఘాటుగా స్పందించారు. రాజమౌళి గారు మీరు కూడా అతడికి కొంత డబ్బు ముట్టజెప్పండి అని సెటైర్ వేశారు. RRR రేటింగ్ 9.1/10. దేశద్రోహి డిజాస్టర్ అని చెబుతున్నాడు. దేశ ద్రోహి రేటింగ్ 1.2/10. కానీ RRR బిగ్గెస్ట్ హిట్. ఇక నీ ఫాల్తూ, తప్పుడు రివ్యూ అవసరం లేదు అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

RRR విజయాన్ని జీర్ణించుకోలేదు..

RRR విజయాన్ని జీర్ణించుకోలేదు..

కేఆర్కే ట్వీట్‌పై మరో నెటిజన్ మరింత ఘాటుగా స్పందించాడు. RRR సినిమా విజయాన్ని నీవు జీర్ణించుకోలేకపోతున్నావు. నీవు ఫేక్ రివ్యూ రాస్తే.. కనీసం ఛాయ్, స్నాక్స్ కూడా ఆయన ఇవ్వలేదు అని సెటైర్ వేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. రాజమౌళి గారు RRR బడ్టెట్‌ను 680 కోట్లు చేశాడు. మీ సినిమా 1000 కోట్లు చేస్తే.. మీ సినిమా బడ్జెట్ 1000 కోట్లు అంటాడు. మీడియా తప్పుడు రిపోర్టులు ఇస్తుందని ట్వీట్లు చేస్తాడు. మీరు ఈ పాగల్‌కు కొంతైనా ముట్టచెప్పండి అని మరో నెటిజన్ చురకలు అంటించాడు.

RRR 8వ రోజు కలెక్షన్లు

RRR 8వ రోజు కలెక్షన్లు

ఇదిలా ఉండగా, RRR సినిమా బాక్సాఫీస్ జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. 8 రోజుల తర్వాత ఈ చిత్రం 751 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 414 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇంకా అన్ని ప్రదేశాల్లోను ఈ చిత్రం నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. త్వరలోనే ఈ చిత్రం 1000 కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X