For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆదిపురుష్ కోసం స్టెరాయిడ్స్.. కీలక విషయాలు వెల్లడించిన నటుడు!

  |

  ప్రభాస్ ఇప్పుడు బిజీయెస్ట్ స్టార్ట్ అయిపోయారు. తెలుగులోనే కాక ఆయన సినిమాల కోసం అన్ని బాషల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ మరికొన్ని సినిమాలు అనౌన్స్ చేశారు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత ఆ సినిమాలు కూడా మొదలు పెట్టనున్నారు. అయితే ఆదిపురుష్ సినిమా కోసం స్టెరాయిడ్స్ వాడుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.

  ప్యాన్ ఇండియా స్టార్

  ప్యాన్ ఇండియా స్టార్

  బాహుబలి తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.. ఆయన చేస్తున్న అన్ని సినిమాలు అన్ని భాషలలో రిలీజ్ అవుతున్నాయి. ఆయన చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. చివరిగా ఆయన చేసిన సాహో సినిమా కలిసి రాలేదు. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా నిరాశపరిచింది.

   మార్పులు చేర్పులు

  మార్పులు చేర్పులు

  ఇక సాహో సినిమా కి వచ్చిన రిజల్ట్ చూసిన ప్రభాస్ జాగ్రత్త పడ్డారు. రాధేశ్యామ్ సినిమా సహా ఇప్పుడు చేస్తున్న మిగతా సినిమాల మీద ఎక్స్ ట్రా కేర్ తీసుకుంటున్నారు. అందుకే చాలా రోజుల క్రితమే పూర్తి కావాల్సిన రాధేశ్యామ్ షూటింగ్ ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. రాధేశ్యామ్ స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులు చేశారని అందుకే సినిమా లేట్ అవుతుంది అని ప్రచారంలో ఉంది.

  ఆదిపురుష్ షూట్

  ఆదిపురుష్ షూట్

  నిజానికి ప్రభాస్ మూడు సినిమాలు అనౌన్స్ చేశారు. ఒకటి నాగ్ అశ్విన్ సినిమా కాగా రెండోది ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా. ఇక ఈ రెండూ కాకుండా ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. నిజానికి 'ఆదిపురుష్' షూటింగ్ ముంబైలో జరిగేది, కానీ దీనిని హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. కానీ అది కూడా తేడా పడింది.

  300 కోట్ల బడ్జెట్

  300 కోట్ల బడ్జెట్

  ఈ సినిమాలో ప్ర‌భాస్ శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న త‌ల్లి కౌసల్య పాత్ర‌లో హేమమాలి‌ని క‌నిపించ‌నుంద‌ని టాక్ నడుస్తోంది. మరోవైపు దశరథుడి పాత్రలో కృష్ణంరాజు నటించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. ఈ సినిమాలో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నారు.

  సన్నీ సింగ్ సీక్రేట్స్

  సన్నీ సింగ్ సీక్రేట్స్

  ఇక సన్నీ సింగ్. నటుడు తన శరీరాన్ని లక్ష్మణుడి పాత్ర కోసం సిద్ధం చేయడానికి ఈ లాక్ డౌన్ ను వాడుకుంటున్నాడు. ఇక ఈ నటుడు తన పాత్ర కోసం కఠినమైన డైట్ ప్లాన్‌ను అనుసరిస్తున్నాడని అంటున్నారు. కధ ప్రకారం సినిమాలో సన్నీ సింగ్ కండలతో కనిపించాలి. తాజాగా ఈ విషయం గురించి సన్నీ సింగ్ కీలక విషయాలు వెల్లడించాడు.

  రోజులో 4-5 సార్లు భోజనం

  రోజులో 4-5 సార్లు భోజనం

  ఈ సినిమాలో నేను 50% కంటే ఎక్కువ పిండి పదార్థాలు, 50% ప్రోటీన్ తీసుకుంటూ ఒక కఠినమైన ఆహార డైట్ ఫాలో అవుతున్నానని పేర్కొన్నారు. ఇక కొన్నిసార్లు నేను రోజుకు 15 గుడ్లు లేదా 10 గుడ్లు తింటానన్న ఆయన నేను ఒక రోజులో 4-5 సార్లు భోజనం తింటాను అని చెప్పుకొచ్చారు.

  Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
  స్టెరాయిడ్లు లేకుండా

  స్టెరాయిడ్లు లేకుండా

  నేను, ప్రభాస్ ఇద్దరూ కండరాలతో కనిపించాలని సన్నీ సింగ్ పేర్కొన్నారు. ఇక ఈ పాత్రల కోసం చక్కగా మేము ఎటువంటి స్టెరాయిడ్లు లేదా సప్లిమెంట్లు లేకుండా సహజంగా పెరుగుతున్నామని పేర్కొన్నారు. సాధారణ ప్రోటీన్స్ తీసుకుంటున్నాము అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది.

  English summary
  Sunny Singh who is playing lakshman role Adipurush is making the most of the lockdown by preparing for his character in the film. To maintain his physique, actor follows a strict diet plan, for his role. he says he is not using any steroids or supplements and taking normal whey protein.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X