రిచా చద్దాకు పాయల్ ఘోష్ భేషరతు క్షమాపణ, పరువు నష్టం కేసు ఉపసంహరణ

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన లైంగిక దాడి ఆరోపణలు మీడియాలో సంచలనం రేపాయి. తెలుగు టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ ఘోష్ మాట్లాడుతూ తనను దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ఇంటికి పిలిచి అత్యాచారం చేయబోయారనే విషయం పెను సంచలన రేపింది.

అయితే తన ఇంటర్వ్యూలో రిచా చద్దాతోపాటు పలువురు హీరోయిన్ల పేర్లు కూడా ప్రస్తావించడం వివాదాస్పదమైంది. పాయల్ చేసిన వ్యాఖ్యలపై రిచా చద్దా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా కూడా వేశారు. దీంతో రిచా చద్దాకు భేషరుతుగా క్షమాపణ చెబుతూ కోర్టుకు అంగీకార పత్రాన్ని అందజేశారు.

Payal Ghosh unconditional apology to Richa Chadha over Anurag Kashyap controversy

రిచా చద్దాపై చేసిన ఆరోపణలను, పోస్టులు, వీడియోలను భేషరతుగా తొలగిస్తానని పాయల్ ఘోష్ చెబుతూ క్షమాపణలు చెప్పారు. దాంతో రిచా చద్దా దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌ను ఆమె తరఫు న్యాయవాది జస్టిస్ ఏకే మీనన్ వెనక్కి తీసుకొన్నారు. భవిష్యత్‌లో ఒకరిపై మరొకరు సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేసుకోకుండా ఉండాలనే నిర్ణయం, షరతుతో పరువునష్టం పిటిషన్ వాపసు తీసుకొన్నారు.

అయితే ఈ వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కథనాలను ప్రసారం చేసిన న్యూస్ ఛానెల్‌ను, వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్‌‌ను 11 కోట్ల రూపాయల మేర నష్టపరిహారం చెల్లించాలని దాఖలు చేసిన పరువు నష్టం దావా కోర్టులో కొనసాగుతుందని చెప్పారు. ఈ కేసును ఆరు వారాల తర్వాత విచారిస్తామని కోర్టు వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X