అలా బతకడం కంటే విడిపోవడమే ఉత్తమం? అమీర్ ఖాన్ విడాకులపై అలియా భట్ సోదరి షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకొంటున్నామని వెల్లడించిన ప్రకటన సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురి చేశాయి. అయితే అమీర్ ఖాన్ రెండో పెళ్లి కూడా భగ్నం కావడంపై సినీ వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్, నిర్మాత పూజా భట్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి. పూజా భట్ ఎవరు? అమీర్ ఖాన్ విడాకుల సంఘటనపై ఎలాంటి కామెంట్లు చేశారంటే...

మహేష్ భట్ మొదటి భార్య కూతురిగా

మహేష్ భట్ మొదటి భార్య కూతురిగా

పూజా భట్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె. అలాగే ఆలియాభట్‌కు సోదరి. మహేష్ భట్ తొలి భార్య కిరణ్ భట్‌కు పుట్టిన సంతానంలో పూజా, రాహుల్ భట్ ఇద్దరు ఉన్నారు. ఇక కిరణ్ భట్‌తో విడిపోయిన తర్వాత మహేష్ భట్ నటి సోని రజ్దాన్‌ను వివాహం చేసుకొన్నారు. సోని, మహేష్ భట్‌కు షహీన్ భట్, ఆలియా భట్ సంతానం కలిగారు.

అమీర్ ఖాన్‌తో హీరోయిన్‌గా పూజాభట్

అమీర్ ఖాన్‌తో హీరోయిన్‌గా పూజాభట్

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పూజా భట్ పలు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలు నిర్మించారు. అంతేకాకుండా తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో దిల్ హై కీ మాంతా నహీ అనే చిత్రంలో అమీర్ ఖాన్‌కు హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రంలో అమీర్, పూజా భట్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం భారీ విజయాన్ని కూడా అందుకొన్నది.

అమీర్, కిరణ్ రావు విడాకులపై ట్వీట్

అమీర్, కిరణ్ రావు విడాకులపై ట్వీట్

తాజాగా అమీర్ ఖాన్, ఆయన రెండో భార్య కిరణ్ రావు జూలై 3 తేదీన తమ 16 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకడం తెలిసిందే. అమీర్ ఖాన్ విడాకుల సంఘటనపై పూజా భట్ స్పందిస్తూ.. భార్య, భర్తలు విడిపోయిన తర్వాత తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ఇద్దరు పంచుకోవడం కొత్తేమీ కాదు అని పూజా భట్ తన ట్వీట్‌లో వెల్లడించారు.

పెళ్లి, బంధాలు అనేవి అంటూ

పెళ్లి, బంధాలు అనేవి అంటూ

అమీర్ ఖాన్ విడాకులపై పరోక్షంగా స్పందిస్తూ.. బంధాలు అనేవి పేపర్ మీద రాసేవి కాదు. బంధాలు అనేవి హృదయానికి సంబంధించినవి. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య రిలేషన్‌షిప్ కొనసాగించడమనేది వారి మధ్య ఉండే సఖ్యతపై ఆధారపడి ఉంటుంది. దానిని కొందరు సమర్ధవంతంగా మేనేజ్ చేస్తారు అని పూజా భట్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Recommended Video

RRR Movie Streaming Details, బిజినెస్ 1200 కోట్ల పైనే || Filmibeat Telugu
పెళ్లిళ్లు దారుణమైన ముగింపు

పెళ్లిళ్లు దారుణమైన ముగింపు

సమాజంలో చాలా వరకు పెళ్లిళ్లు దారుణమైన ముగింపుకు నోచుకొంటాయి. కలిసి బతకడంపై కంటే విడిపోవడమే మేలనే చేదు నిజాన్ని, ఆ వ్యతిరేకతను కొందరు త్వరగా అంగీకరించడమే కాకుండా దానిని పక్కాగా అర్ధం చేసుకొంటారు. మరికొందరు తమ రిలేషన్‌షిప్‌లో బాధపడుతూనే బయటకు సంతోషంగా ఉన్నామని అబద్దాలు చెబుతుంటారు. కొన్ని పెళ్లిళ్లు ఎందుకు బ్రేకప్ అవుతాయో అర్ధం కాదు అని పూజాభట్ వివాహ బంధం విచ్చిన్నంపై వేదాంతం చెప్పేందుకు ప్రయత్నించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X