Just In
- 1 hr ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 1 hr ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 2 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 3 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
తెలుగు ప్రముఖులకు ‘పద్మ’ అవార్డులపై స్పందించిన పవన్ కళ్యాణ్
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తన కాపురంపై ప్రియాంక చోప్రా షాకింగ్ రియాక్షన్: వయసులో చిన్నోడైనా.. అందులో మాత్రం అంటూ!
ప్రియాంక చోప్రా.. ఈ పేరు తెలియని వారుండరు అనడంలో సందేహం లేదు. అంతలా ఆమె రెండు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై ప్రభావం చూపిస్తోంది. కేవలం హిందీ చిత్ర పరిశ్రమకే పరిమితం కాకుండా.. దేశంలోని చాలా ఇండస్ట్రీల్లో పని చేసిన ఆమె.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక, హాలీవుడ్ వెబ్ సిరీస్‌లలోనూ నటించి.. తన ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది. అదే సమయంలో పాప్ సింగర్‌ను వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక చోప్రా తన భర్తతో ఉన్న ఏజ్ గ్యాప్ గురించి షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైంది.. ప్రపంచాన్ని గెలిచి
2000 సంవత్సరంలో జరిగిన అందాల పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది ప్రియాంక చోప్రా. అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా ఇండియన్ ఫిల్మ్స్‌లో నటిస్తూ తన హవాను చూపిస్తోందీ బాలీవుడ్ బ్యూటీ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆమె.. కొద్ది రోజుల క్రితం హాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది.

హాలీవుడ్ ఎంట్రీ... పాప్ సింగర్‌తో పెళ్లి
హాలీవుడ్‌లోకి ప్రవేశించిన సమయంలోనే అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా ప్రేమలో పడింది. తనకంటే చిన్న వాడే అయినా అతడితో చాలా కాలం పాటు రహస్యంగా డేటింగ్ చేసింది. ఈ వ్యవహారం బయటకు వచ్చిన కొద్ది రోజులకే నిక్‌ను వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఎంతో మంది సెలెబ్రిటీలు హాజరయ్యారు.

మొత్తం మార్చుకుని.. విమర్శలపాలు
హాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రియాంక చోప్రా వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. విచిత్రమైన డ్రెస్‌లు వేసుకోవడంతో పాటు వీకెండ్ పార్టీలు, డ్రింకింగ్ పార్టీలు వంటి చేస్తూ కనిపించింది. అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడా అలవాటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో వైరల్‌గా మారాయి. దీంతో ప్రియాంక చోప్రా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది.

శృతి మించిన రొమాన్స్.. హాట్ టాపిక్
రహస్యంగా డేటింగ్ చేస్తున్న సమయంలో నిక్ జోనస్.. ప్రియాంక చోప్రా పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్ చేయడం ద్వారా మీడియా కంట పడ్డారు. అప్పుడే వీళ్ల బంధం బయటకు వచ్చింది. ఇక, వివాహం తర్వాత వీళ్లిద్దరూ మరింతగా రెచ్చిపోతున్నారు. తరచూ ముద్దులు పెట్టుకోవడం, రొమాంటిక్‌గా ఫోజులివ్వడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అయ్యారు.

భర్తతో ఏజ్ గ్యాప్‌పై ప్రియాంక కామెంట్స్
ప్రియాంక చోప్రా తన కంటే వయసులో పదేళ్ల చిన్నవాడైన నిక్ జోనస్‌ను వివాహం చేసుకుంది. ఆ సమయంలో వీళ్లిద్దరి ఏజ్ గ్యాప్ గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ సంస్థ ఇంటర్వ్యూలో ఆమెకు దీనిపై ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. ‘భర్తతో కాపురం చేయడానికి వయసుతో పనేముంది' అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది.

వయసులో చిన్నోడైనా.. అందులో మాత్రం
దీనికి వివరణ ఇస్తూ.. ‘సాధారణ జంటల్లానే వయసులో తేడా ఉన్నా మేము కూడా మంచిగానే ఉంటున్నాం. విభేదాలు తలెత్తినప్పుడు పరిష్కరించుకుంటున్నాం. వాస్తవానికి నిక్ వయసులో చిన్నవాడైనా మనసులో మాత్రం గొప్పోడు. కొన్ని సందర్భాల్లో నాకెంటే ఎక్కువగా ఆలోచిస్తాడు. అందుకే అతడితో నాకెప్పుడూ కంఫర్ట్‌గా ఉంటుంది' అంటూ చెప్పొకొచ్చింది ప్రియాంక.