Just In
- 19 min ago
18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్డౌన్లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
అక్కడి టాటూను పవన్ చూశారు.. ఆఫర్ చేయడంతో రెండు గంటలు: ఆ ఫోటోతో మేటర్ రివీల్ చేసిన అషు రెడ్డి
- 1 hr ago
ప్రియుడి పేరును బయట పెట్టిన యాంకర్ శ్రీముఖి: తన క్రష్ ఎవరో కూడా రివీల్ చేసిన రాములమ్మ
- 12 hrs ago
ఓ వైపు సాయి పల్లవి, మరోవైపు శేఖర్ కమ్ముల.. ఏదైనా నాగచైతన్యకు లాభమే!
Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు..తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకి! ప్రియాంక చోప్రా, దీపికా పదుకునేలను దాటేసి!
- News
తండ్రి బాటకు భిన్నంగా: షర్మిల పార్టీ పేరు మారుతోందా?: రెండు కొత్త పేర్లు: ప్లేస్, డేట్ ఫిక్స్
- Finance
సెంట్రల్ బ్యాంకు కొత్త MD & CEOగా తెలుగు వ్యక్తి
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక నష్టాన్ని భరించాలి...!
- Automobiles
ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వాళ్లు నాతో ఆ పనులు చేయించారు.. అందుకే పెదవి విప్పలేదు: భయంకర నిజాలు చెప్పిన ప్రియాంక చోప్రా
ఆకట్టుకునే అందంతో చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ప్రపంచాన్నే గెలిచిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించిన ఈ అమ్మడు.. దాదాపు మూడు దశాబ్దాలుగా తన హవాను చూపిస్తూనే ఉంది. దేశంలోని చాలా భాషల్లో నటించి సత్తా చాటింది. హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పాప్ సింగర్‌ను పెళ్లాడిన ఈ భామ.. అక్కడే స్థిరపడిపోయింది. ఇక, ఇటీవల తన ఆత్మకథ 'అన్‌ఫినీష్‌డ్'తో సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న భయంకర పరిస్థితులను వివరించింది. ఆ సంగతులు మీకోసం!

చిన్న వయసులోనే ప్రపంచ సుందరిగా
సినిమాల్లోకి రావాలన్న లక్ష్యంతో మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది ప్రియాంక చోప్రా. అలా చాలా షోలలో క్యాట్ వాక్ చేసిన ఈ అమ్మడు 2000లో జరిగిన అందాల పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారిన ఆమె.. అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా అన్ని భాషల్లో నటిస్తూ తన హవాను చూపిస్తోంది. దీంతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది కూడా.

హాలీవుడ్ ఎంట్రీ.. సింగర్‌తో ప్రేమ.. పెళ్లి
సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో భాషల్లో నటించి మెప్పించిన ప్రియాంక.. ఇండియాలో బెస్ట్ హీరోయిన్‌గా కితాబందుకుంది. ఇక్కడ తన మార్క్ చూపించిన ఈ భామ.. హాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించింది. ఆ సమయంలోనే అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది. వయసులో చిన్నోడే అయినా రహస్యంగా డేటింగ్ చేసింది. ఆ తర్వాత నిక్ జోనస్‌ను వివాహం చేసుకుంది.

పూర్తిగా మారిన ప్రియాంక.. విమర్శలు
హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా ప్రవర్తనలో పూర్తిగా మార్పులు వచ్చాయి. అందాలు కనువిందు చేసేలా డ్రెస్‌లు వేసుకోవడంతో పాటు డ్రింకింగ్ పార్టీలు వంటి చేస్తూ కనిపించింది. అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడా అలవాటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో వైరల్‌గా మారడంతో విమర్శలు వచ్చాయి.

‘అన్‌ఫినీష్‌డ్'తో ప్రకంపనలు రేపిందిగా
ప్రియాంక చోప్రా ఇటీవల ‘అన్‌ఫినీష్‌డ్' పేరుతో పుస్తక రూపంలో తన ఆత్మకథను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఎన్నో అంశాలను అందులో ప్రస్తావించిందామె. కొందరు దర్శక నిర్మాతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, బట్టలు తీసి చూపించమన్నారని, సర్జరీలు చేయించుకోమన్నారని సంచలన ఆరోపణలు చేసింది ప్రియాంక.

ప్రియాంక వ్యాఖ్యలతో షాక్‌లో బాలీవుడ్
ఆ ఆత్మకథలో ప్రియాంక చోప్రా చాలా మంది దర్శకులు, నిర్మాతల బండారాలు బయట పెట్టింది. దీంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా ప్రకంపణలు రేగాయి. అప్పటి నుంచి ఈ హీరోయిన్ తరచూ ట్రెండ్ అవుతూనే ఉంది. దీంతో ప్రియాంకను ఇబ్బందులకు గురి చేసిన దర్శక నిర్మాతలు వీళ్లనంటూ పలువురి పేర్లు ప్రచారం అయ్యాయి. అదే సమయంలో ఆమె ఆరోపణలపై అనుమానాలు వచ్చాయి.

భయంకర నిజాలు చెప్పిన ప్రియాంక చోప్రా
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంకకు ‘ఆత్మకథలో రాసిన అంశాలను అప్పట్లోనే ఎందుకు బయట పెట్టలేదు' అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ‘అప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పెదవి విప్పి చెప్పలేదు. ఎందుకలా చేశానంటే.. నాకెన్నో భయాలున్నాయి. నాలో అభద్రతాభావం ఎక్కువగా ఉండేది' అని చెప్పింది. అంటే అప్పట్లో ఆమెను బెదిరించేవారని పరోక్షంగా బయటపెట్టిందామె.
సీనియర్ హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య అదిరిపోయే హాట్ ఫొటోలు