నీ దేశానికి వెళ్లిపో.. లేకుంటే నీపై గ్యాంగ్ రేప్ చేస్తాం.. ప్రియాంక చోప్రాకు బెదిరింపులు
తొమ్మిదేళ్ల క్రితం అమెరికాలో ప్రారంభమైన ప్రియాంక చోప్రా సినీ ప్రయాణం ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నది. అయితే అమెరికాలో అరంగేట్రం చేసిన తొలినాళల్లో తనకు ఎదురైన చేదు అనుభవాలు, ఇబ్బందులు, సమస్యలను తాజాగా రిలీజ్ చేసిన తన ఆత్మకథ అన్‌ఫినీష్డ్‌లో పేర్కొన్నారు. ఆమె తన పుస్తకంలో పేర్కొన్న ప్రకారం..

తొమ్మిదేళ్ల క్రితం యూఎస్‌లో
ప్రియాంక చోప్రా క్వాంటికో అనే టెలివిజన్ సీరియల్‌తో అమెరికా వినోద పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇన్ మై సిటీ ఆల్బమ్‌తో అమెరికా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన వర్ణ వివక్ష, ఈ మెయిల్, ట్వీట్స్‌తో వేధించిన తీరును పుస్తకంలో వెల్లడించారు.

తొలి సీరీస్‌తో థ్రిల్‌గా ఫీలయ్యా
అమెరికా టెలివిజన్‌లో క్వాంటికో అనే నా తొలి సీరియల్ ప్రసారమైన మొదటి రోజు నేను ఎంతో థ్రిల్‌గా ఫీలయ్యాను. ఆ తర్వాత ఇన్ మై సిటీ ప్రోమో వీడియోతో అత్యధిక మందికి చేరువయ్యేలా చేసింది. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు ఉండలేదు అని తన బాధను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు.

నన్ను జాతి వివక్షతో దూషిస్తూ
2012లో నా పాట యూఎస్ ఎంటర్‌టైన్ ఇండస్ట్రీలో ప్రసారం కాగానే కలిగిన ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. నన్ను ద్వేషిస్తూ కుప్పలు తెప్పలుగా ఈమెయిల్స్, మెసేజ్ వచ్చాయి. నలజాతి టెర్రిరిస్టు అంటూ మెసేజ్ పెడుతూ దూషించారు. ఆల్ అమెరికల్ గేమ్స్ ప్రమోట్ చేస్తున్నావా? నీ అంతు చూస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

నీ దేశానికి వెళ్లిపో అంటూ
నాకు బెదిరింపులు అంతటితో ఆగలేదు. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన నల్లజాతిదానా? ముఖంపై బుర్ఖా కప్పుకొని వెళ్లు. నీ దేశానికి నీవు వెళ్లిపో లేదంటే నీపై గ్యాంగ్ రేప్ చేస్తాం అని నీచంగా నాపై దూషణలకు పాల్పడ్డారు. దాంతో నేను చాలా వేదనకు గురయ్యాను అని ప్రియాంక చోప్రా తన పుస్తకంలో పేర్కొన్నారు.

బెస్ట్ సెల్లర్‌గా అన్‌ఫినీష్డ్
తన జీవితంలో జరిగిన సంఘటనలు, ఎదురైన అనుభవాలు తాజాగా అన్‌ఫినీష్డ్ పుస్తకంలో పొందు పరిచారు. న్యూయార్క్ టైమ్స్‌లో ఈ పుస్తకానికి సంబంధించిన కథనాలు ప్రచురితమయ్యాయి. అమెరికాలో బెస్ట్ సెల్లర్‌గా ఈ పుస్తకం రికార్డు అమ్మకాలను సాధించింది.


Click it and Unblock the Notifications











