»   »  ‘రాజి’ ట్రైలర్: పాకిస్థాని భార్యగా, భారత గూఢాచారిగా అలియా సూపర్ పెర్ఫార్మెన్స్

‘రాజి’ ట్రైలర్: పాకిస్థాని భార్యగా, భారత గూఢాచారిగా అలియా సూపర్ పెర్ఫార్మెన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరో విభిన్నమైన చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'రాజి' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె భారత గూఢాచారి సెహ్‌మత్ పాత్రలో కనిపించబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్లో అలియా భట్ పెర్ఫార్మెన్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

1971 బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్ భార్యగా వెళ్లి ఆమె అక్కడ ఎలాంటి మిషన్ నిర్వహించింది అనేది ఈ చిత్ర ఇతివృత్తం. పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్ ఇక్భాల్ పాత్రలో విక్కీ కౌశల్, సెహ్‌మత్ తండ్రి హిదయాత్ ఖాన్ పాత్రలో రజిత్ కపూర్ నటించారు.

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న అలియా భట్.... ఈ సినిమా ద్వారా పెర్ఫార్మెన్స్ పరంగా ఆమె మరో లెవల్‌కి వెళుతుందని విశ్లేషకులు అంటున్నారు.

దాదాపు రెండున్నర నిమిషాల నిడివిగల 'రాజి' ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. సన్నివేశాలు చిత్రీకరించిన తీరు కూడా అద్భుతంగా ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. వినీత్ జైన్, కరణ్ జోహార్, యష్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలు. శంకర్ ఎస్సాన్ లాయ్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, జే ఐ పటేల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ కానుంది. మే 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
‘Raazi’ Official Trailer released. The movie starring Alia Bhatt and Vicky Kaushal amongst others. Raazi is based on a true story of a young girl, who was sent to Pakistan in 1971, to source out any information she could, as war was becoming imminent between India and Pakistan. It is the journey of an ordinary Indian girl, in extraordinary circumstances.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X