»   » హాలీవుడ్ రేంజిలో ఉంది: సల్మాన్ రేస్-3 ట్రైలర్ అదిరిపోయింది!

హాలీవుడ్ రేంజిలో ఉంది: సల్మాన్ రేస్-3 ట్రైలర్ అదిరిపోయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హాలీవుడ్ రేంజిలో ఉంది: సల్మాన్ రేస్-3 ట్రైలర్ అదిరిపోయింది!

బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు, సల్మాన్ ఖాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'రేస్-3'. ఈద్(రంజాన్) సందర్భంగా జూన్ 15న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సినిమాపై అంచనాలు మరింత పెంచుతూ మంగళవారం సాయంత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఒళ్లుగగుర్బొడిచే యాక్షన్ సీన్లతో ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ బట్టి సినిమా హాలీవుడ్ యాక్షన్ సినిమా రేంజిలో ఉంటుందని ఊహించుకోవచ్చు.

 బాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్

బాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్

బాలీవుడ్లో రూపుదిద్దుకుంటున్న అతిపెద్ద ప్రాజెక్ట్ 'రేస్ 3'. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వెలిన్, డైసీ షా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ చూస్తే సినిమా కోసం హాలీవుడ్ స్థాయిలో భారీగా ఖర్చు పెట్టారని తెలుస్తోంది.

 నీకు ఫ్యామిలీ ఉన్నపుడు శత్రువులు అవసరం లేదు

నీకు ఫ్యామిలీ ఉన్నపుడు శత్రువులు అవసరం లేదు

నీకు ఫ్యామిలీ ఉన్నపుడు శత్రువులు అవసరం లేదు అంటూ క్యాప్సన్ పెట్టడం ద్వారా ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించారు. స్టోరీ ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది.

 ఏ పాత్రలో ఎవరు?

ఏ పాత్రలో ఎవరు?

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సికిందర్ పాత్రలో కనిపించబోతున్నారు. జెస్సికా పాత్రలో జాక్వెలిన్, సిజ్లింగ్ సంజన పాత్రలో డైసీ షా, యాంగ్రీ యంగ్ మ్యాన్ సూరజ్ పాత్రలో సాఖిబ్ సలీమ్, విలన్ పాత్రలో ఫ్రెడ్డీ దరువాలా, 'బాస్' శంషేర్ పాత్రలో అనిల్ కపూర్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు.

స్పెషల్ ట్రైనింగ్

స్పెషల్ ట్రైనింగ్

ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం జాక్వెలిన్, డైసీ షా ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారట. వీరి మధ్య జరిగే ఫైట్ సన్నివేశాలు అబుదాబిలో చిత్రీకరించాని సమాచారం. ఉత్కంఠ కలిగించే విధంగా ఈ సన్నివేశాలు ఉండనున్నాయి.

ట్రైలర్

ఈద్(రంజాన్) సందర్భంగా జూన్ 15న విడుదల ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. బాలీవుడ్లో ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈ చిత్రం బద్దలు కొడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

English summary
"Ye race zindagi ki race hai.. Kisi ke zindagi lekar hi khatam hogi." The moment that Salman Khan's fans have been eagerly waiting for is here, as the trailer of Race 3 is out and it's nothing but bang on! Fans are going gaga over Salman Khan's suave look in the trailer. The trailer of Race 3 showcases glimpses of Jacqueline Fernandez's pole dance sequence. Jacqueline Fernandez will be collaborating with Remo D'Souza for the second time with Race 3 and going by the trailer, she is all set to have one more hit in her kitty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X