For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వారివల్ల అవకాశాలు కోల్పోయాను, అడ్డదారులు తొక్కలేదు.. రాధికా ఆప్టే కామెంట్స్

  |

  లెజండ్ మూవీలో బాలకృష్ణ సరసన నటించిన రాధికా ఆప్టే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ బ్యూటిలలో ఒకరైన రాధికా ఆప్టే కేవలం నటనతోనే కాకుండా గ్లామర్ తో కూడా అప్పుడప్పుడు ఊహించని విధంగా షాక్ ఇస్తుంటుంది. ఎవరు ఏమనుకున్నా కూడా లెక్క చేయని రాధికా తనకు నచ్చినట్లుగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. అలాగే ఏ విషయాన్నైనా బోల్డ్ గా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే అప్పుడప్పుడు తాను మాట్లాడే మాటలు వివాదాస్పదం కూడా అవుతుంటాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో అవకాశాలు, వయసు, సర్జరీలు, అడ్డదారులు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది ఈ హాట్ భామ.

  ముద్దుగుమ్మ వివాదాలు..

  ముద్దుగుమ్మ వివాదాలు..

  వివాదాలకు, బోల్డ్ కంటెంట్‌లకు కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది హాట్ బ్యూటి రాధికా ఆప్టే. తమిళ, తెలుగు భాషల్లో కొన్ని సినిమాల్లో పాపులర్ అయిన ఈ భామ హిందీలోనూ సత్తా చాటింది. నటించడంలోనూ, అందాలను ఆరబోయడంలోనూ హద్దులు చేరిపేసిన ఈ ముద్దుగుమ్మ వివాదాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకంగా న్యూడ్‌గా కూడా నటించేసిన ఈ భామ.. తాజాగా మరో షాకింగ్ కామెంట్స్ తో ముందుకు వచ్చింది.

  కుండ బద్దలు కొట్టినట్లు..

  కుండ బద్దలు కొట్టినట్లు..

  'రక్త చరిత్ర', బాలయ్యతో 'లెజెండ్', 'లయన్', ప్రకాష్ రాజ్ హీరోగా వచ్చిన ధోని సినిమాలో కూడా నటించి మెప్పించింది. తెలుగు నాట మంచి క్రేజ్ ఉన్నా గానీ ప్రస్తుతం ఆమె తెలుగు ప్రేక్షకుల వైపు చూడటం లేదు. రాధికా ఆప్టే ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతోనే బిజీగా ఉంటోంది. 'వెడ్డింగ్ గెస్ట్' 'పార్చ్ డ్' సినిమాల్లో నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది రాధికా ఆప్టే. అయితే ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లేడుస్తుంటుంది రాధిక ఆప్టే.

  పాత్రలతోనే వివదాలు..

  పాత్రలతోనే వివదాలు..

  రాధిక ఆప్టే ఎక్కువగా ఆమె ఎంచుకున్న పాత్రలతోనే వివాదాల పాలైంది. పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఎలాంటి సీన్లలో నటించడానికైన రాధికా ఆప్టే హద్దు చెప్పదు. అయితే గతంలో తన బాడీ పార్ట్స్ విషయంలో అవకాశాలు రాలేదని ఘాటుగానే చెప్పుకొచ్చింది. అప్పుడు "వేరే నటికి పెద్ద పెదవులు, నా కన్నా ఎద భాగం పెద్దగా ఉన్నందున నన్ను రిజెక్ట్ చేశారు'' అని రాధికా ఆప్టే వెల్లడించింది.

  లుక్ కారణంగా అవకాశాలు..

  లుక్ కారణంగా అవకాశాలు..

  తాజాగా రాధికా ఆప్టే 'మోనికా ఓ మై డార్లింగ్' సినిమాలో నటించింది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నిన్న (నవంబర్ 11)న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది రాధికా ఆప్టే. ఈ ఇంటర్వ్యూలో లుక్ కారణంగా అవకాశాలు ఎప్పుడైనా కోల్పోయారా అని అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ చేసింది రాధికా ఆప్టే. కొన్నిసార్లు లుక్ కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే.

  కమర్షియల్ చిత్రాల్లో యంగ్ హీరోయిన్స్..

  కమర్షియల్ చిత్రాల్లో యంగ్ హీరోయిన్స్..

  "హీరోయిన్స్ కు ఆఫర్స్ రావడంలో వయసు అనేది కూడా ప్రధాన అంశం. బడా కమర్షియల్ చిత్రాల్లో యంగ్ హీరోయిన్లు ఉండటాన్నే ఆడియెన్స్ ఇష్టపడుతున్నారు. దాన్ని కాదనలేం. కొన్ని సార్లు నేను లుక్ కారణంగా అవకాశాలు కోల్పోయిన మాట నిజమే. మీకు ఆ XYZ లేదు.. మాకు అదే అవసరం అని కొంతమంది నాతో అన్నారు. టాలెంట్ కాకుండా లుక్స్ ను బట్టి అవకాశాలు ఇవ్వడం ఇలా భారత్ లోనే కాదు.. విదేశాల్లో కూడా ఉంది. ఈ అంశంపై నటీమణులు పోరాడుతున్నారు.

  ఆ మాయలో పడిపోలేదు..

  ఆ మాయలో పడిపోలేదు..

  నేను మాత్రం అందం అనే మాయలో పడిపోలేదు. యవ్వనంగా కనిపించడం కోసం ఎప్పుడూ ఏ సర్జరీలు నమ్ముకోలేదు. అవకాశాల కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కలేదు. హద్దు దాటలేదు. కానీ సక్సెస్ కోసం ఇబ్బంది పడిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి" అని చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటి రాధికా ఆప్టే. ఇక ఆమె నటించిన తాజా సినిమా మోనికా ఓ మై డార్లింగ్ లో రాజ్ కుమార్ రావు, హుమా ఖురేషీ, ఆకాంక్ష రంజన్ కపూర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది.

  English summary
  Bollywood Hot Beauty Radhika Apte Open Up On Ageism In Bollywood But She Did Not Go For Surgeries And Younger Actress Has Opportunities
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X