Raj Kundraకు బెయిలిస్తే నీరజ్ మోడీలా పారిపోతాడు.. శిల్పాశెట్టి భర్త కోర్టు మరో షాక్!

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్‌కుంద్రాకు మరోసారి నిరాశే మిగిలింది. తనకు బెయిల్ ఇప్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దాంతోపాటు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు కోర్టుకు వివరించిన విషయాలు ఆయన బెయిల్‌కు అడ్డంకిగా మారాయి. దాంతో మరికొన్ని రోజులు రాజ్ కుంద్రా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్ కుంద్రా గురించి అధికారులు మోపిన 19 ఆరోపణలు ఏమిటంటే...

సాక్ష్యులను బెదిరించే అవకాశం

సాక్ష్యులను బెదిరించే అవకాశం

బాలీవుడ్ మీడియా వెల్లడించిన ప్రకారం.. ఇంటర్నేషన్ పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా విచారణకు సహకరించడం లేదు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతున్నది. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను బెదిరించే అవకాశం ఉంది. ఈ కేసులో బాధితులు ఇంకా చాలా మంది సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి రాజ్ కుంద్రాకు బెయిల్ ఇవ్వడం ఈ పరిస్థితుల్లో మంచిది కాదు అని క్రైమ్ బ్రాంచ్ అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు.

వాళ్ల మాదిరిగా తప్పించుకుపోతాడు

వాళ్ల మాదిరిగా తప్పించుకుపోతాడు

పోర్న్ కంటెంట్ అప్‌లోడ్ కేసులో నిందితుడైన రాజ్ కుంద్రా బ్రిటన్‌ పౌరుడు. ఒకవేళ బెయిల్ ఇస్తే నీరజ్ మోడీ, మేహల్ చోకసీ రూట్ మాదిరిగా తప్పించుకొని వెళ్లే అవకాశం ఉంది. ఒకసారి తప్పించుకొంటే అతడిని ఇండియాకు రప్పించడం కష్టం. ఇలాంటి వ్యక్తికి బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు అందించిన వాళ్లం అవుతాం. కాబట్టి రాజ్ కుంద్రాకు బెయిల్ పిటిషన్ ఇచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అని క్రైమ్ బ్రాంచ్ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం.

రాజ్ కుంద్రా బంధువు ఆచూకీ లేకుండా

రాజ్ కుంద్రా బంధువు ఆచూకీ లేకుండా

ఇంటర్నేషనల్ పోర్న్ రాకెట్ కేసులో అశ్లీల వీడియోలు ఎక్కడి నుంచి అప్‌లోడ్ చేస్తున్నారనే విషయంపై దర్యాప్తు కొనసాగుతున్నది. ఒకవేళ బెయిల్ ఇస్తే మళ్లీ ఇలాంటి కంటెంట్‌ను విదేశాల నుంచి అప్‌లోడ్ చేస్తాడు. దాంతో భారతీయ సంస్కృతికి విఘాతం కలుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కుంద్రా బంధువు ప్రదీప్ భక్షి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆయన పలు సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. ఈ కేసులో బాధితులంతా పేద యువతులు, కాబట్టి బెయిల్ ఇస్తే అలాంటి వారికి న్యాయం జరగదు అంటూ అదికారులు కోర్టుకు విన్నవించారు.

సాక్ష్యాలు తారుమారు చేస్తాడని

సాక్ష్యాలు తారుమారు చేస్తాడని

రాజ్ కుంద్రా సోసైటీలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఇప్పటికే పలు సాక్ష్యాలను నాశనం చేశాడు. బెయిల్ ఇస్తే ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందిని మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమర్పించిన నివేదిక, కొన్ని విషయాల ఆధారంగా రాజ్ కుంద్రాకు బెయిల్ నిరాకరించారు. కొద్ది రోజుల క్రితం జూలై 19వ తేదీ వరకు ఆయనకు కోర్టు కస్టడీ విధించింది. కాబట్టి 20వ తేదీ వరకు రాజ్ కుంద్రా జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Recommended Video

Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
ఆగస్టు 20వ వరకు జైలులోనే..

ఆగస్టు 20వ వరకు జైలులోనే..

రాజ్ కుంద్రా కేసును తిరిగి ఆగస్టు 20వ తేదీన విచారిస్తామని కోర్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా గతేడాది ముంబై పోలీసులు దాఖలు చేసిన పోర్న్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకొన్న పిటిషన్‌ను సెషన్స్ కోర్టు కూడా తిరస్కరించింది. దీంతో రాజ్ కుంద్రా పరిస్థితి మరింత దారుణంగా మారింది. జూలై 19వ తేదీన హాట్ షాట్స్, ఇతర యాప్‌ల్లో ద్వారా పోర్న్ కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X