»   » సల్మాన్ కేసు 20 ఏళ్ల నాటిది, నిరుపేదల పంతం 500 ఏళ్ల నాటిది.. కండల వీరుడి శిక్షకు కారణం ఇదే!

సల్మాన్ కేసు 20 ఏళ్ల నాటిది, నిరుపేదల పంతం 500 ఏళ్ల నాటిది.. కండల వీరుడి శిక్షకు కారణం ఇదే!

Subscribe to Filmibeat Telugu
కండల వీరుడిని మట్టి కరిపించిన 'బిష్ణోయ్': ఎందుకింతలా పోరాడారు..!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష ఖరారు అయిన సంగతి తెలిసిందే. జోధ్ పూర్ న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు వెల్లడిస్తూ కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో బాలీవుడ్ వర్గాలు విస్మయాన్ని వ్యక్తం చేసాయి. సల్మాన్ ఖాన్ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ కేసులో భాగం ఉన్న మిగిలిన నటులు టబు, సైఫ్ అలీ ఖాన్ లని న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. సల్మాన్ ఖాన్ పై నమోదైన ఈ కేసు ఈ నాటిది కాదు. 1998 లో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ లో కృష్ణ జింకలని వేటాడినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. సల్మాన్ ఖాన్ కు శిక్ష పడడం వారి కుటుంబ సభ్యులని వేదనకు గురి చేసే అంశమే. బాలీవుడ్ వర్గాలు సల్మాన్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. కానీ సల్మాన్ ఖాన్ కు శిక్ష పడితే సంతోషించే వారు కూడా ఉన్నారని తెలుసా !

జన రంజక నటుడు

జన రంజక నటుడు

దశాబ్దాల కాలంగా సల్మాన్ ఖాన్ తన చిత్రాలతో అలరిస్తూ కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ సల్మాన్ ఖాన్ జీవితంలో ఒడిదుడుకులు తప్పలేదు. సల్మాన్ ఖాన్ పై తీవ్రమైన కేసులు ఉన్నాయి. వాటిలో ఒక ఈ కృష్ణ జింకల కేసు.

షూటింగ్ సందర్భంగా కృష్ణ జింకల వేట

షూటింగ్ సందర్భంగా కృష్ణ జింకల వేట

సల్మాన్ ఖాన్ 1998 లో నటించిన ఓ చిత్ర షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్ళాడు. అక్కడ ఈ కండల వీరుడు కృష్ణ జింకలని వేటాడినట్లు ఆరోపణలు రావడంతో అదే ఏడాది కేసు నమోదైంది.

20 ఏళ్లుగా చిక్కుల్లో

20 ఏళ్లుగా చిక్కుల్లో

గత 20 ఏళ్లుగా సల్మాన్ ని ఈ కృష్ణ జింకల వేట కేసు వేధిస్తోంది. పలు పర్యాయాలు సల్మాన్ ఈ కేసు వలన కోర్టు చుట్టూ తిరగవలసి వచ్చింది. సల్మాన్ కు ఈ కేసు కంటి మీది కునుకు లేకుండా చేస్తోంది.

సంచలన తీర్పు

సంచలన తీర్పు

గురువారం రాజస్థాన్ లోని జోధ్ పూర్ న్యాయస్థానం ఈ కేసులో సంచలన తీర్పు వెల్లడిస్తూ సల్మాన్ ఖాన్ ని దోషిగా ప్రకటించింది. వన్య ప్రాణి సంరక్షణ చట్టాలు చాలా కఠినమైనవి. దీనితో న్యాయస్థానం సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

 వారికి విముక్తి

వారికి విముక్తి

సల్మాన్ తో పాటు సైఫ్ అలీఖాన్, టబు మరియు సోనాలి బింద్రే వంటి నటులపై కూడా ఈ కేసు నమోదైంది. కానీ వారిని న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.

కుటుంబ సభ్యలతో సహా బాలీవుడ్ మొత్తం

కుటుంబ సభ్యలతో సహా బాలీవుడ్ మొత్తం

కోర్టు తీర్పుతో సల్మాన్ ఖాన్ ఖాన్ కుటుంబం బాధలో మునిగిపోయింది. సల్మాన్ ఖాన్ చెల్లెళ్లు అర్పిత, అల్విరా కోర్టులోనే బోరున విలపించినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పడడంతో బాలీవడ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేసాయి.

సల్మాన్ ఖాన్ కు శిక్ష పడితే సంతోషించేది వారే

సల్మాన్ ఖాన్ కు శిక్ష పడితే సంతోషించేది వారే

సల్మాన్ ఖాన్ చాలా మందికి ఆరాధ్య నటుడు కావచ్చు. గొప్ప వ్యక్తిగా అతడిని భావించవచ్చు. కానీ అతడికి శిక్ష పడితే సంతోషించే ఒక జాతే ఉంది. వారే రాజస్థాన్ లోని బిష్ణోయ్ సమాజం. సల్మాన్ పై వీరు గత 20 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

బిష్ణోయ్ లు అలాంటి వారు

బిష్ణోయ్ లు అలాంటి వారు

ఈ బిష్ణోయ్ తెగ నిరుపేద తెగ. నిరుపేదలే అయినప్పటికి పోరాటంలో మాత్రం వీరు వెనకడుగు వేయరు. ప్రాణార్పణకైనా సిద్ధం అయిపోతారు. జంతువులు, వృక్షాలు అంటే వీరికి ప్రాణం. వృక్షాలని నరకడం, జంతువులని చంపడం వీరు మహా పాపంగా భావిస్తారు.

 ఇద్దరు కూతుళ్లతో కలసి ప్రాణార్పణ

ఇద్దరు కూతుళ్లతో కలసి ప్రాణార్పణ

1730లో అప్పటి జోధ్ పూర్ మహా రాజు కోట నిర్మాణానికి ఖ్రేజి చెట్లని నరికివేయాలని ఆదేశించాడు. ఆ చెట్లని బిష్ణోయ్ లు అంతంత్య పవిత్రంగా భావిస్తారు. రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసారు. అమృతదేవి అనే మహిళా ఆమె ఇద్దరు కుమార్తెలు చెట్ల నరికివేతని అడ్డుకుంటూ వాటిని కౌగలించుకుని ప్రాణార్పణ చేసారు. ఆ మహిళలల పోరాటం బిష్ణోయ్ లకు స్ఫూర్తిగా నిలిచింది.

500 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటే కారణం

500 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటే కారణం

సల్మాన్ ఖాన్ ఇప్పుడు జైలు పాలు అయ్యాడంటే.. ఐదు వందల ఏళ్ల క్రితం బిష్ణోయ్ తెగ వారి గురువుకు ఇచ్చిన మాటే కారణం అని చెప్పొచ్చు. వన్య ప్రాణులని, వృక్షాలని కాపాడతామని బిష్ణోయ్ లో వారు గురువు జాంభేశ్వర్ కి ఐదువందల ఏళ్ల క్రితం మాట ఇచ్చారు. తమ పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయం అని వారు ఇచ్చిన మాటే నేడు సల్మాన్ జైలు శిక్షకు కారణం అయింది.

 20 ఏళ్లుగా పోరాటం

20 ఏళ్లుగా పోరాటం

బిష్ణోయ్ లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలని వేటాడినప్పటి నుంచి అతడిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. వీరు కృష్ణ జింకలని తమ సొంత బిడ్డల తరహాలో పెంచుకుంటారు. ఈ జాతి మొత్తం శాఖాహారులే.

English summary
Rajasthan Bishnoi community 20 years fight against Salman Khan. Facts behind Salman Khan case
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X