»   » నిర్మాతను బ్లేమ్ చేయొద్దు... ఇక్కడ రేప్‌లు జరుగవు అంటున్న హాట్ లేడీ!

నిర్మాతను బ్లేమ్ చేయొద్దు... ఇక్కడ రేప్‌లు జరుగవు అంటున్న హాట్ లేడీ!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అంశంపై శ్రీరెడ్డి పోరాటం చివరకు ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడి మాదిరిగానే బాలీవుడ్లో కూడా కాస్టింగ్ కౌచ్ అంశంపై తాజాగా పెద్ద చర్చ సాగుతోంది. సీనియర్ బాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కాస్టింగ్ కౌచ్ అంశం లేవనెత్తడంతో ఈ విషయం గురించి అక్కడ హాట్ టాపిక్ నడుస్తోంది. ఇటీవల బీబీసీ డాక్యుమెంటరీలో కాస్టింగ్ కౌచ్ అంశంపై రాధిక ఆప్టే, మరాఠి నటి ఉషా జాదవ్ సెక్సువల్ ఎక్సప్లోటేషన్ గురించి మాట్లాడారు. తాజాగా బాలీవుడ్ హాట్ లేడీ రాఖీ సావంత్ ఈ అంశంపై స్పందించారు. బాలీవుడ్ డర్టీ సీక్రెట్స్ బయట పెట్టారు.

  నేను కూడా ఇలాంటివి ఎదుర్కొన్నాను

  నేను కూడా ఇలాంటివి ఎదుర్కొన్నాను

  ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కాస్టింగ్ కౌచ్ పరిస్థితులు తనకు కూడా ఎదురయ్యాయని అని రాఖీ సావంత్ తెలిపారు. అయితే ప్రతి నిర్మాత, డైరెక్టర్ అలా ఉండరని రాఖీ సావంత్ స్పష్టం చేశారు. తాను ఎవరికీ అలాంటి ఛాన్స్ ఇవ్వలేదని, టాలెంటుతోనే అవకాశాలు దక్కిచుకుని ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.

  ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ రేప్ చేయరు

  ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ రేప్ చేయరు

  సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ రేప్ చేయరు. చాలా మంది ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అయి తమకు తాముగా లొంగిపోతారు. కాస్టింగ్ కౌచ్ అంశం గురించి సరోజ్ ఖాన్ బహిరంగంగా మాట్లాడినందకు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఇలాంటి విషయాల గురించి బయటకు చెప్పుకోవడాని ఇష్టపడరు. ఆమె దైర్యంగా వెల్లడించారు అని రాఖీ సావంత్ అన్నారు.

  నిర్మాతలను బ్లేమ్ చేయవద్దు

  నిర్మాతలను బ్లేమ్ చేయవద్దు

  కాస్టింగ్ కౌచ్ అంటూ నిర్మాతలను బ్లేమ్ చేయవద్దు. అవకాశాల కోసం లొంగిపోయే వారు ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తున్నారు. అవకాశాల కోసం ఇలా షార్ట్‌కట్ దారులు వెతుక్కుంటున్నారు అని రాఖీ సావంత్ అన్నారు.

  కొంత మంది స్వయంగా సెక్సువల్ ఫేవర్ చేస్తారు

  కొంత మంది స్వయంగా సెక్సువల్ ఫేవర్ చేస్తారు

  కొంత మంది గర్ల్స్ నిర్మాతలు, దర్శకులు అడగక పోయినా వారే వెళ్లి సెక్సువల్ ఫేవర్ చేస్తుంటారు. తర్వాత అవకాశాలు ఇవ్వడం లేదని బ్లేమ్ చేస్తుంటారు. ఇలాంటి వాటి వల్ల అవకాశాలు ఎప్పుడూ రావు, నీలో టాలెంట్ ఉన్నపుడే నీకు అవకాశాలు వస్తాయని అని రాఖీ తెలిపారు.

  సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా...

  సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా...

  సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ అయ్యారంటే కారణం వారి హార్డ్ వర్క్... ఇది తప్ప వారు ఈ స్థాయికి రావడానికి మరో కారణం లేదు. హార్డ్ వర్క్ చేయకుండా షార్ట్ కట్ దారిని ఎంచుకుంటే దారి తప్పే అవకాశం ఉంది అని రాఖీ సావంత్ అన్నారు.

  గర్ల్స్ మాత్రమే కాదు, బాయ్స్ కూడా

  గర్ల్స్ మాత్రమే కాదు, బాయ్స్ కూడా

  అవకాశాల కోసం సెక్సువల్‌గా లొంగిపోతున్న వారిలో కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా ఉన్నారు. ఎంటర్టెన్మెంట్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అని రాఖీ సావంత్ తెలిపారు.

  English summary
  "Nobody rapes anyone in this film industry. It's all consensual and voluntary. In this, I fully support Sarojji. At least she has spoken her mind and let the world know the truth. People in Bollywood don't speak out the truth about the casting couch although it is happening right here in front of their eyes. They feel they are making their way up why should they bother with what's happening around them? I really admire Sarojji for letting the world know the reality that they have to face every day. Sarojji has seen what goes here. I totally agree with her," Rakhi Sawant said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more