Salman Khan బిగ్‌బాస్‌లో రాంచరణ్, ఎన్టీఆర్ రచ్చ.. రాజమౌళి, ఆలియాభట్ టాస్కులతో హల్‌చల్
బాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తమ సత్తాను చాటుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR సినిమా జనవరి 7వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ముంబైలో భారీగా ప్రమోషన్స్‌ను నిర్వహిస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్ మెరిసారు. వీరిద్దరు కలిసి బిగ్‌బాస్ వేదికపై చేసిన హంగామా ఎలా ఉండబోతుందంటే..

సల్మాన్ ఖాన్‌తో రాంచరణ్, ఎన్టీఆర్
బాలీవుడ్ హీరోల్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో రాంచరణ్‌కు మంచి అనుబంధం ఉంది. ముంబైకి రాంచరణ్ వెళ్లినా సల్మాన్ ఆతిథ్యాన్ని, సల్మాన్ హైదరాబాద్‌కు వచ్చినా రాంచరణ్ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. అలాంటి అనుబంధమే ఎన్టీఆర్‌కు కూడా ఉంది. ఈ ముగ్గురు హీరోల అనుబంధానికి RRR సినిమా మరోసారి వేదికగా మారింది.

ముంబైలో RRR ప్రమోషన్స్
RRR సినిమా ప్రమోషన్స్‌ను రాజమౌళి, కరణ్ జోహర్ గట్టిగానే ప్లాన్ చేశారు. ఇటీవల జరిగిన ప్రమోషన్ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేదికపై సల్మాన్ ఖాన్ చేసిన హంగామాను ప్రోమోగా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టికెట్ టూ ఫినాలేలో రచ్చ
అయితే ఇంటిలో టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతున్నది. ఈ షోలో లవ్ బర్డ్స్‌గా క్రేజ్‌ను సొంతం చేసుకొన్న కరణ్ కుంద్రా, తేజస్విని ప్రకాశ్ మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఇళ్లంతా గందరగోళంగా మారింది. అంతేకాకుండా ప్రతీక్ సేహజ్‌పాల్, నిషాంత్ భట్ మధ్య గొడవ జరగడంతో ఇంట్లోని విలువైన వస్తువులు కూడా ధ్వంసం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో RRR సినిమా టీమ్ వేదిక మీదకు వచ్చి తమ సినిమాను ప్రమోట్ చేస్తూ కనిపించారు.

వీకెండ్ కా వార్ షోలో RRR టీమ్
తాజాగా రిలీజ్ చేసిన బిగ్‌బాస్ వీకెండ్ ప్రోమోలో బిగ్‌బాస్ ఇంటిలోని కంటెస్టెంట్లతో దర్శక ధీరుడు రాజమౌళి, ఆలియా భట్, రాంచరణ్, ఎన్టీఆర్ మాట్లాడుతూ ఉత్సాహపరిచారు. ఇంటి సభ్యులతో టాస్కులను ఆడిస్తూ షోకు మరింత ఎనర్జీని రప్పించారు.

నోరా ఫతేహి, గురు రాంధ్వా కూడా
బిగ్‌బాస్ 15 షోలో వారాంతంలో ప్రసారమయ్యే వీకెండ్ కా వార్ కార్యక్రమంలో రాంచరణ్, ఎన్టీఆర్ పాల్గొనడంతో ఈ వారాంతం కార్యక్రమంపై క్రేజ్ పెరిగింది. ఈ షోలో వీరిద్దరితోాపాటు బాలీవుడ్ శృంగార తార నోరా ఫతేహి, సింగర్ గురు రాంధ్వా పాల్గొన్నారు. నోరా, గురు షూట్ చేసిన వీడియో సాంగ్‌ను బిగ్‌బాస్ వేదికపై రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











