»   » మాజీ ప్రియుడికి దగ్గరవుతున్న దీపికా పదుకొన్..

మాజీ ప్రియుడికి దగ్గరవుతున్న దీపికా పదుకొన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Deepika Padukone Meets Ranbir In A Fashion Show

బాలీవుడ్‌లో ప్రస్తుతం పాపులర్ ప్రేమ జంట ఎవరంటే ఠక్కున సమాధానం ‌రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొన్. వారిద్దరి పెళ్లికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లి వార్తల నేపథ్యంలో తన మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌కు దగ్గరవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌లో వారిద్దరు కలిసి పాల్గోననున్నారు.

 రణ్‌వీర్‌తో అఫైర్‌కు ముందు

రణ్‌వీర్‌తో అఫైర్‌కు ముందు

రణ్‌వీర్‌తో ప్రేమలో పడటానికి ముందు రణ్‌బీర్ కపూర్‌, దీపికా మధ్య అఫైర్ నడిచిన సంగతి తెలిసిందే. యే జవానీ హై దీవానీ చిత్ర షూటింగ్‌లో వారిద్దరు ప్రేమలో పడ్డారు. వారిద్దరు కలిసి తమాషా అనే చిత్రంలోనూ నటించారు. ఆ తర్వాత విడిపోయిన వారిద్దరూ ప్రస్తుతం స్నేహితులుగా ఉంటున్నారు. రణ్‌వీర్‌తో కలిసి ర్యాంప్‌పై నడుస్తున్నట్టు ఇన్స్‌టాగ్రామ్‌లో మనీష్ మల్హోత్రా వెల్లడించారు.

 జోరందుకొన్న పెళ్లి వార్తలు

జోరందుకొన్న పెళ్లి వార్తలు

రణ్‌బీర్‌తో విడిపోయిన తర్వాత రణ్‌వీర్‌తో దీపికా ప్రేమలో పడింది. గత కొన్నేళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్ నటి అనుష్కశర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి తర్వాత వీరిద్దరి మ్యారేజ్ వార్తలు ఊపందుకొన్నాయి.

సెప్టెంబర్ తర్వాత దీపికా పెళ్లి

సెప్టెంబర్ తర్వాత దీపికా పెళ్లి

దీపికా, రణ్‌వీర్ పెళ్లి సెప్టెంబర్, డిసెంబర్ మధ్య ఏదో ఒక తేదీని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల పెళ్లికి సంబంధించిన ఆభరణాలు, దస్తులు కూడా కొనే పనిలో దీపికా బిజీగా ఉన్నట్టు తెలిసిందే. ఇటీవల తన తల్లి, చెల్లెలుతో షాపింగ్ చేస్తూ దీపికా మీడియా కంటికి చిక్కింది.

గ్యాంగ్‌స్టర్ పాత్రలో దీపికా

గ్యాంగ్‌స్టర్ పాత్రలో దీపికా

దీపిక కెరీర్ విషయానికి వస్తే.. విశాల్ భరద్వాజ్ రూపొందించే చిత్రంలో ఆమె నటించనున్నారు. గ్యాంగ్‌స్టర్ రహీమా ఖాన్ పాత్రను దీపికా పోషిస్తున్నట్టు సమాచారం. పద్మావతి చిత్రం తర్వాత మళ్లీ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే చిత్రంలో కూడా దీపికా, రణ్‌వీర్ నటించనున్నారనే వార్తలు మీడియాలో షికారు చేస్తున్నాయి.

English summary
Before her romance with Ranveer Singh, Deepika Padukone's relationship with Ranbir Kapoor was the talk of the town. They started seeing each other in 2008, during the shooting of their film, Bachna Ae Haseeno. They broke many hearts, when they parted ways in 2009. However, they still remained friends, and still created magic in their films. the former couple is set to reunite for an event. The former couple will walk the ramp for Manish Malhotra at a fashion show. The designer announced their collaboration on Instagram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X