»   » విరుష్క దారిలో దీపికా, రణ్‌వీర్.. పెళ్లి డేట్ ఫిక్స్.. లండన్‌లో..!

విరుష్క దారిలో దీపికా, రణ్‌వీర్.. పెళ్లి డేట్ ఫిక్స్.. లండన్‌లో..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాలుగైదు సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలుతున్న బాలీవుడ్ తారలు దీపికా పదుకొన్, రణ్‌వీర్ సింగ్‌ త్వరలోనే ఒక్కటవ్వనున్నారు. దీప్‌వీర్ ప్రేమకు వారి తల్లిదండ్రులు అంగీకారం తెలిపినట్టు సమాచారం. వచ్చే మూడు, నాలుగు నెలల్లోపు ఎప్పుడైనా దీపికా, రణ్‌వీర్ పెళ్లి జరిగే అవకాశాలున్నాయి. పెళ్లి విషయంలో వీరిద్దరూ విరుష్క దారిలోనే నడుస్తున్నట్టు తెలుసున్నది.

ముంబైలో పెళ్లి డేట్ ఫిక్స్

ముంబైలో పెళ్లి డేట్ ఫిక్స్

రణ్‌వీర్, దీపికా పదుకొన్ పెళ్లి తేదీని ఖారారు చేసేందుకు వారిద్దరి తల్లిదండ్రులు ఇటీవల కలుసుకొన్నారట. పెళ్లి తేదీ ఫిక్స్ చేయడానికి దీపికా పదుకొన్ తల్లిదండ్రులు ప్రకాశ్, ఉజ్జల ముంబైకి వెళ్లినట్టు తెలిసింది. దక్షిణ భారత దేశ సంప్రదాయలకు అనుగుణంగా పెళ్లి చేయడానికి నిర్ణయించుకొన్నట్టు సమాచారం.

దీపిక బర్త్ డే కు ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఆ ?
 పెళ్లిపై దీపికా నివాసంలో

పెళ్లిపై దీపికా నివాసంలో

ప్రభాదేవి రెసిడెన్స్‌లోని దీపిక నివాసంలో ఇరు కుటుంబాలు సుదీర్ఘంగా చర్చించుకొన్నారనే తాజా కబురు. చర్చలు, సంప్రదింపుల తర్వాత వర్లీలోని ఓ హోటల్‌లో డిన్నర్‌కు వెళ్లినట్టు బాలీవుడ్ మీడియా కథనాలు వెల్లడించింది.

విరుష్క దారిలోనే దీప్‌వీర్

విరుష్క దారిలోనే దీప్‌వీర్

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి మాదిరిగానే డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. మీడియా, ఫ్యాన్స్ హంగామాకు దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. పెళ్లి తర్వాత ముంబైలో భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది.

లండన్‌లో పెళ్లి షాపింగ్

లండన్‌లో పెళ్లి షాపింగ్

పెళ్లికి సంబంధించిన షాపింగ్‌ పనిలో దీపికా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రణ్‌వీర్ తల్లిదండ్రులతో కలిసి లండన్‌లో జోరుగా షాపింగ్ చేస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. అయితే జోయా అఖ్తర్ రూపొందిస్తున్న గల్లీ బాయ్ షూటింగ్‌లో బిజీగా ఉండటం కారణంగా ఈ షాపింగ్‌కు రణ్‌వీర్ దూరంగా ఉన్నట్టు సమాచారం.

 ఎంగేజ్‌మెంట్ ఓ జోక్

ఎంగేజ్‌మెంట్ ఓ జోక్

దీపికా బర్త్‌డే సందర్భంగా శ్రీలంకలో రణ్‌వీర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు వచ్చిన వార్తలను ఆమె కొట్టిపడేశారు. తన ఎంగేజ్‌మెంట్ వార్తలు ఓ పెద్ద జోక్ అని దీపిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గత నాలుగేళ్లుగా మీడియాలో నా ఎంగేజ్‌మెంట్ జరుగుతూనే ఉంది అని దీపికా ఎద్దేవా చేశారు.

 నాలుగేళ్లుగా మీడియాలో ఎంగేజ్‌మెంట్

నాలుగేళ్లుగా మీడియాలో ఎంగేజ్‌మెంట్

నా పెళ్లికి సంబంధించిన రూమర్లు ఎక్కడ నుంచి పుడుతాయో అర్థం కావడం లేదు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచన లేదు. కేవలం ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్‌పైనే ఉంది. పెళ్లికి సంబంధించిన నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదు అని దీపికా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

English summary
Ranveer Singh and Deepika Padukone marriage on cards. Ranveer and Deepika's parents have already met to finalise the wedding date. Apparently, Prakash and Ujjala Padukone flew down from Bengaluru to Mumbai last week for the same. Ranveer and Deepika wanted a destination wedding, away from the prying eyes of the media, a la Virat Kohli and Anushka Sharma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu