twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరైనా ఆ విషయం గురించి అడిగితే.. అలా చెబుతాను.. రణ్‌వీర్ సింగ్

    |

    బాలీవుడ్‌లో కండల వీరుడు రణ్‌వీర్ సింగ్ వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. గత ఎనిమిదేళ్లుగా వెండితెర మీద అద్భుతమైన ప్రతిభను చాటుతూ ఉత్తమ చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. బ్యాండ్ బాజా బారాత్, రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్, గల్లీ బాయ్ లాంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచాయి. ఇక 2020లో పలు చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. కబీర్ ఖాన్ నటించిన 83 చిత్రంలోను, యష్ రాజ్ ఫిలింస్ జయేష్ భాయ్ జోర్దార్, కరణ్ జోహర్ రూపొందించే తఖ్త్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

    నా సక్సెస్ కారణం నేను ఎంపిక చేసుకొనే పాత్రలే. ఆ పాత్రలో విలువు ఉండే విధంగా చొరవ తీసుకొంటాను. నా కెరీర్ ఆరంభం నుంచి విలక్షణమైన నటుడిగా గుర్తించబడేందుకు ప్రయత్నిస్తున్నాను. అందుకు తగినట్టే భావోద్వేగమైన నటనతో ప్రేక్షకులను మెప్పించానని భావిస్తున్నాను. అల్లా ఉద్దీన్ ఖిల్జీ (పద్మావత్), సంగ్రాం భలేరావు (సింబా), మురాద్ (గల్లీభాయ్) లాంటి పాత్రలకు మంచి ప్రశంసలు వచ్చాయి అని తెలిపారు.

     Ranveer Singh: Stardom comes with performer

    నాకు సంబంధించిన నేను మంచి ఫెర్ఫార్మర్‌గా నిలువాలని కోరుకొంటాను. ఫెర్ఫార్మ్ చేస్తేనే స్టార్‌డమ్ దానంతట అదే వస్తుంది. ఎవరైన యంగ్ యాక్టర్లు ఏదైనా సలహా అడిగితే.. మీకు నటన పట్ల ప్యాషన్ ఉందా అని అడుగుతాను. ఫెర్ఫార్మ్ చేయడం వల్లే మీకు స్టార్‌డమ్ వస్తుంది. అదే మీలో ఓ రకమైన చైతన్యం తెస్తుంది. యాక్టింగ్‌ను బాధ్యతగా తీసుకోవాలి అని సలహాలు ఇస్తానని రణ్‌వీర్ చెప్పాడు.

    English summary
    Ranveer Singh created a stardom with Band Baaja Baarat, Ram Leela, Bajirao Mastani, Padmaavat, Gully Boy. Now he is coming with projects like Kabir Khan’s 83 to Yash Raj Films’ Jayeshbhai Jordaar to Karan Johar’s Takht.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X