»   » రవీనా టాండన్‌పై కేసు నమోదు.. నిషిద్ధ ప్రాంతంలో.. తడమలేదంట..

రవీనా టాండన్‌పై కేసు నమోదు.. నిషిద్ధ ప్రాంతంలో.. తడమలేదంట..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆలయ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై శ్రీ లింగరాజ ఆలయ నిర్వాహకులు రవీనాపై భువనేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆర్కియోలాజీ సర్వే ఇండియా పర్యవేక్షణలోని 11వ శతాబ్దం నాటి శివాలయంలోని నో కెమెరా జోన్ (కెమెరాలు వాడకూడని)‌లో వ్యాపార ప్రకటన షూట్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం.

   శివాలయంలో సౌందర్య చిట్కాలు

  శివాలయంలో సౌందర్య చిట్కాలు

  ఆలయ ప్రాంగణంలో సౌందర్యానికి సంబంధించిన చిట్కాలు ఇచ్చే కార్యక్రమంలో రవీనా టాండన్ హోస్ట్‌గా వ్యవహరించింది. ఆమె షూట్ చేసిన తర్వాత పురాతన ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.

   మొబైల్ ఫోన్‌తో షూట్

  మొబైల్ ఫోన్‌తో షూట్

  ఓ వ్యక్తి తన మొబైల్‌తో షూట్‌ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఈ అంశం వివాదంగా మారింది. ముందస్తు చర్యగా రవీనా టాండన్‌పై కేసు నమోదు చేయడం జరిగింది.

   నిషిద్ధ ప్రాంతంలో షూటింగ్

  నిషిద్ధ ప్రాంతంలో షూటింగ్

  నిషిద్ధ ప్రదేశంలో షూటింగ్ జరిపారని రవీనా టాండన్‌పై ఆలయ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఎక్కడైతే షూట్ చేశారో అక్కడ కెమెరాలు ఉపయోగించకూడదు. ఆ ప్రాంతంలో షూట్ చేయకూడదు అని ఆలయ పాలక మండలి ఇంచార్జి రాజీవ్ లోచన్ చెప్పారు.

   ఎఫ్ఐఆర్ నిజమే.. దర్యాప్తు

  ఎఫ్ఐఆర్ నిజమే.. దర్యాప్తు

  రవీనా టాండన్‌పై వచ్చిన ఆరోపణలపూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ దాఖలైంది నిజమే అని భువనేశ్వర్ డీసీపీ సత్యబ్రత్ భోయ్ చెప్పారు. ఆలయంలోని మొబైల్ ఫోన్లను తీసుకొనే వెసలుబాటు కేవలం సేవలకులకే ఉంది. కానీ వీడియో చిత్రీకరించడమనేది సెక్యూరిటీ నిబంధనలను తుంగలో తొక్కడమే అని పోలీసులు వెల్లడించారు.

  భక్తుల మనోభావాలపై దెబ్బ

  భక్తుల మనోభావాలపై దెబ్బ

  రవీనా టాండన్ షూట్ చేసిందా లేక చిత్ర యూనిట్‌లో ఎవరైనా షూట్ చేశారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ విషయంలో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దర్యాప్తు చేస్తున్నది.

   అందరి చేతిలో సెల్‌ఫోన్లు

  అందరి చేతిలో సెల్‌ఫోన్లు

  ఆలయ ప్రాంగణంలో షూటింగ్ వివాదంపై రవీనా టాండన్ స్పందించారు. మొబైల్ ఫోన్లలో నన్ను ఎవరైనా షూట్ చేశారా అనే విషయంపై నాకు అవగాహన లేదు. నా చుట్టుపక్కల ఉన్నవాళ్ల చేతిలో సెల్‌ఫోన్లు ఉన్నాయి. చాలా మంది నాతో సెల్ఫీలు దిగారు అని రవీనా టాండన్ చెప్పింది.

  ఫిట్‌నెస్ కార్యక్రమంలో

  ఫిట్‌నెస్ కార్యక్రమంలో

  నా ఫిట్‌నెస్ గురించి ఓ కార్యక్రమాన్ని షూట్ చేశారు. హోస్ట్ అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. అంతకుమించి నాకు ఏం జరిగిందో నా దృష్టికి రాలేదు అని రవీనా టాండన్ వెల్లడించింది.

   నన్ను తడమలేదు..

  నన్ను తడమలేదు..

  ఈ వివాదంలో నాకు ఒకటే ఆశ్చర్యంగా ఉంది. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా భక్తులు సెల్‌ఫోన్లను తీసుకెళ్లినప్పుడు ఎందుకు తనిఖీలు చేయలేదు. నేను ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు పోలీసులు నన్ను తనిఖీ చేయలేదు. తడమలేదు. నా హ్యాండ్‌బ్యాంగ్‌ను చెక్ చేయలేదు అని రవీనా అన్నారు.

  నిబంధనలను ఉల్లంఘించలేదు..
  పురాతన ఆలయాలు, సంప్రదాయాలు అంటే నాకు అమితమైన ఇష్టం. ఇప్పటివరకు చాలా ఆలయాలను సందర్శించాను. ఎప్పుడు ఆలయ నిబంధనలను ఉల్లంఘించలేదు అని రవీనా చెప్పింది.

  English summary
  The authorities of Sri Lingaraj Temple has lodged an FIR against Bollywood actress Raveena Tandon for allegedly shooting an advertisement in the 'No Camera Zone' inside the premises of the 11th century and ASI protected lord Shiva shrine. The incident come to the fore after a video surfaced in social media featuring Tandon offering beauty tips inside the temple premises and it is recorded by a person with a mobile phone.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more