twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. ఉచ్చులో 20 మంది టాప్ స్టార్స్, నేతలకూ లింకులు.. రియా అరెస్ట్‌కు..

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో బయటపడుతున్న విషయాలు సంచలనాలు రేకెత్తిస్తుంటే.. మరో పక్క డ్రగ్ మాఫియాతో లింకులు బాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డ్రగ్ మాఫియాతో రియా చక్రవర్తి వాట్సప్ ఛాటింగ్ బయటకు వచ్చిన నేపథ్యంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆమెపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో డ్రగ్ మాఫియాతో బాలీవుడ్ హీరోలు, రాజకీయ నేతల లింకులు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. డ్రగ్ మాఫియాతో లింకులు గురించి మరిన్ని వివరాలు..

    సుశాంత్ వంట మనిషి నీరజ్‌ సమాచారంతో

    సుశాంత్ వంట మనిషి నీరజ్‌ సమాచారంతో

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు దర్యాప్తును చేపట్టిన తర్వాత సీబీఐ విచారణ విషయంలో దూకుడు ప్రారంభించింది. రియా చక్రవర్తితో ఇతరులకు ఉన్న సంబంధాల కోణంలో విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలోనే నీరజ్ చెప్పిన డ్రగ్స్ వాడకం అంశం అనే తీగను లాగి బాలీవుడ్ డొంకను కదిలించే ప్రయత్నం చేస్తున్నది.

    రియాపై పలు కేసు నమోదు

    రియాపై పలు కేసు నమోదు

    ఇక డ్రగ్ మాఫియాతో సంభాషణలు జరిపిన విషయాల ఆధారంగా రియా చక్రవర్తిపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రియా చక్రవర్తిపై నార్కోటిక్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 20, 27, 29 ప్రకారం కేసు నమోదు చేసింది. త్వరలోనే రియా చక్రవర్తిని ఈ కేసులో విచారించేందుకు ఎన్సీబీ సిద్ధమవుతున్నది.

    20 మంది హీరో, హీరోయిన్లకు లింకులు

    20 మంది హీరో, హీరోయిన్లకు లింకులు


    బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. బాలీవుడ్ హీరోల్లో చాలా మంది అగ్ర నటులకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. దాదాపు 20 మంది బాలీవుడ్ స్టార్లకు సంబంధముందనే విషయంపై అంచనాకు వచ్చారు. అంతేకాకుండా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు రాజకీయ నేతలతోపాటు మరికొందరికి లింకులు ఉన్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో రియాను అరెస్ట్ చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

    సర్కార్‌పై బీజేపీ ఫైర్

    సర్కార్‌పై బీజేపీ ఫైర్

    డ్రగ్ మాఫియాతో రాజకీయ నేతలకు సంబంధాలున్నాయనే వార్త బయటకు రాగానే ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకున్నది. బీజేపీ నేత రామ్ కదమ్ తీవ్రంగా స్పందించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును రాష్ట్ర ప్రభుత్వం తొక్కేయాలని చూస్తున్నది. ఈ కేసుతోపాటు నార్కోటిక్ కోణంలో కూడా కేసును విచారించాలి అని అన్నారు.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    విచారణ జరిగితే టాప్ హీరో, హీరోయిన్లందరూ జైల్లోనే

    విచారణ జరిగితే టాప్ హీరో, హీరోయిన్లందరూ జైల్లోనే

    ఇదిలా ఉండగా, డ్రగ్స్ వ్యవహారం బయటకు రాగానే బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సరైన రితీలో విచారణ జరిపితే డ్రగ్స్ వ్యవహారంలో టాప్ హీరో, హీరోయిన్లందరూ జైల్లోనే ఉంటారు అని ట్వీట్ చేశారు. బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ లింకులు ఉన్నాయనే విధంగా ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.

    English summary
    Narcotics Control Bureau (NCB) has files case on Rhea Chakraborty in Drug links. DG Rakesh Asthana given clarity on case filing to media. Reports suggest that more than 20 top A listers have connections with Drug dealers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X