»   » సల్మాన్ ఖాన్ మరదలితో అసభ్యంగా సీనియర్ హీరో.. అంత కోపం ఎందుకు!

సల్మాన్ ఖాన్ మరదలితో అసభ్యంగా సీనియర్ హీరో.. అంత కోపం ఎందుకు!

Subscribe to Filmibeat Telugu

సీనియర్ హీరో రిషి కపూర్ అప్పుడప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ వివాదం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో జరిగిన ఓ ఘటనతో సీనియర్ నటుడు రిషి కపూర్ వివాదంలో చిక్కుకున్నారు.

కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ వివాహ వేడుకకు తన ఫ్యామిలీతో హాజరయ్యాడు. సల్మాన్ ఖాన్ మరదలు సీమా ఖాన్ పట్ల రిషి కపూర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. రిషి కపూర్ అలా ప్రవర్తించడానికి కారణం సల్మాన్ పై ఉన్న కోపమే అని అంటున్నారు.

Rishi Kapoor bad behaviour with Salman Khan sister in law

రిషి కపూర్ తో వివాహవేడుకలో సల్మాన్ ఖాన్ మాట్లాడలేదట. దీనితో కోపగించుకున్న సీనియర్ నటుడు సల్మాన్ మరదలిపై తన కోపాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీనా ఖాన్ సల్మాన్ తో చెప్పిందట. రిషి కపూర్ తో ఈ విషయం గురించి మాట్లాడడానికి సల్మాన్ ఖాన్ ప్రయత్నించగా అప్పటికే ఆయన పెళ్లి నుంచి వెళ్ళిపోయాడట. రిషి కపూర్ చేసిన తప్పిదానికి చింతించిన ఆయన సతీమణి నీతూ కపూర్.. సల్మాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

English summary
Rishi Kapoor bad behaviour with Salman Khan' sister in law. Rishi Kapoor's wife apologized after this incident
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X