twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిషి కపూర్ ఇంటిని పాకిస్థాన్ ఏం చేయబోతోందో తెలుసా?

    |

    ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ ఇంటిని పాకిస్థాన్ ప్రభుత్వం మ్యూజియంగా మార్చబోతోంది. పెషావర్లోని ఖిస్సా ఖ్వానీ బజార్లో రిషీ కపూర్ పూర్వీకులకు ఇల్లు ఉంది. తమ ఇంటిని మ్యూజియంగా మార్చాలని రిషీ కపూర్ కోరడంతో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ అందుకు అంగీకరించారు.

    ''మాకు రిషీ కపూర్ ఫోన్ చేశారు. పెషవర్‌లోని తమ పూర్వీకుల ఇంటిని మ్యూజియంగా మార్చడం లేదా ఏదైనా ఇనిస్టిట్యూషన్ కోసం కేటాయించాలని కోరారు. ఆయన రిక్వెస్ట్ పాకిస్థాన్ ప్రభుత్వం ఆమెదిస్తోంది'' అని ఖురేషి ఇండియన్ జర్నలిస్టులకు తెలిపారు.

    ముదిరిన ఎఫైర్: హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్న హీరో హీరోయిన్?ముదిరిన ఎఫైర్: హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్న హీరో హీరోయిన్?

    Rishi Kapoor’s Peshawar house convert into museum soon

    పాకిస్థాన్ అంతర్గత మంత్రి షెహ్య్రార్ ఖాన్ అఫ్రిది కూడా ఈ విషయాన్ని ఖరారు చేశారు. రిషి కపూర్ తమ ఇంటిని మ్యూజికంగా మార్చాలని కోరారని, దానిపై తాము పాజిటివ్‌గా స్పందించినట్లు తెలిపారు.

    రిషీ కపూర్... ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ కుమారుడనే విషయం తెలిసిందే. రాజ్ కపూర్ ఫ్యామిలీ దేశ విభజన సమయంలో పెషావర్ నుంచి ఇండియా వచ్చి సెటిలయ్యారు. పెషావర్‌లో వారు నివసించిన ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది.

    English summary
    Rishi Kapoor’s Peshawar house convert into museum soon. Foreign Minister Shah Mahmood Qureshi said the Pakistan government will make the actor’s house into a museum, heeding to a request by the actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X