twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోవిడ్ బాధితుల కోసం RRR యాక్టర్ సహాయం.. మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు

    |

    కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకు లెక్కలనంతగా పెరిగిపోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రోజుకు లక్షల మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఆధునిక వైద్య రంగంలో ఎప్పుడు కూడా ఇలాంటి విషాద ఛాయలు నమోదు కాలేదు. వేల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసి పోతుండడం అందరిని కదిలిస్తోంది. ఇక కొంతమంది సినీ సెలబ్రెటీలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

    రెజీనా కాసాండ్రా.. చీరలో ఎన్ని అందాలో..

    మరోసారి RRR యాక్టర్ అజయ్ దేవ్ గన్ తన మంచితనాన్ని చాటుకున్నారు. కోవిడ్ రోగుల కోసం రూపొందుతున్న తాత్కాలిక వైద్య కేంద్రాల సదుపాయాల కోసం ఆయన సహాయం అందిస్తున్నారు. ముంబైలోని భారత్ స్కౌట్స్ , గైడ్ హాల్‌ను కోవిడ్ కేర్ కేంద్రాలుగా మార్చారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సపోర్ట్, పారా మానిటర్లతో 20 పడకల కోవిడ్ కేర్ గా బాంబే మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) మార్చేసింది.

    RRR actor ajay devgan contributes for a Covid care facility

    అందుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మొత్తం అజయ్ దేవగన్ తన సామాజిక సేవా విభాగం NY ఫౌండేషన్స్ ద్వారా అందజేశారు. గతంలో చాలాసార్లు అజయ్ దేవ్ గన్ తన ఫౌండేషన్ ద్వారా రైతులకు పేద విద్యార్థులకు చేయుతను అందించాడు. ఇక వీలైనంత వరకు కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతను అరికట్టే యుద్ధంలో తనవంతు సహాయం చేయాలని అజయ్ నిర్ణయించుకున్నాడు.

    English summary
    mumbai Municipal Corporation (BMC) has converted Bharat Scouts and Guide Hall in Mumbai into a 20-bed Covid care facility with ventilators, oxygen support, and para monitors. Ajay Devgan contributed the funds for the establishment of this facility through his social service wing NY Foundations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X