For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పిరుదులు పట్టుకొని మీదకు, రూమ్‌కు రమ్మని.. బాలీవుడ్‌లో నటిపై డైరెక్టర్‌ చిత్రహింసలు

  |

  బాలీవుడ్‌లో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ఈ సారి ప్రముఖ నిర్మాత, దర్శకుడు విపుల్‌ షాపై అందాల తార, ఇరాన్‌కు చెందిన మోడల్ ఇల్నాజ్ నొరౌజీ ఆరోపణలు ఎక్కుపెట్టింది. నమస్తే ఇంగ్లండ్ సినిమా షూటింగ్‌కు ముందు తనను లైంగికంగా వేధించాడు అని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. సినిమాలో ఆఫర్ ఇస్తానని చెప్పి మూడు నెలలు నన్న చిత్ర హింసలు పెట్టారని భయంకరమైన విషయాలను బయటపెట్టింది. తనకంటే ముందు జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు ఆఫర్ ఇచ్చినప్పటీకి విపుల్ ప్రవర్తన కారణంగా ఆమె దానిని తిరస్కరించిందని ఇల్నాజ్ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..

  నమస్తే ఇంగ్లండ్ ఆడిషన్స్‌కు

  నమస్తే ఇంగ్లండ్ ఆడిషన్స్‌కు

  నమస్తే ఇంగ్లండ్ సినిమా కోసం పాటియాలాకు ఆడిషన్స్‌కు పిలిచి పలుసార్లు నన్ను ముద్దు పెట్టుకొనేందుకు ప్రయత్నించాడు. నా పిరుదులు పట్టుకొని తనపైకి లాక్కొనేందుకు ప్రయత్నించే వాడు. ఇలా చాలా సార్లు నన్ను లైంగికంగా వేధించాడు. చివరికి నన్ను ఆడిషన్ కూడా చేయలేదు అని ఇల్నాజ్ వెల్లడించింది.

  మూడు నెలలపాటు చిత్రహింస

  మూడు నెలలపాటు చిత్రహింస

  ఆడిషన్స్ పేరుతో నన్ను మూడు నెలలు చిత్రహింసలు పెట్టారు. ఆఫర్ కోసం అన్నీ భరించాను. చివరికి ఆడిషన్ చేసే బాధ్యతను క్యాస్టింగ్ డైరెక్టర్ హానీ ట్రెహాన్‌కు అప్పగించారు. ఒకవేళ నేను విపుల్‌తో పడుకొంటే నాకు ఆ సినిమాలో అవకాశం దక్కేది. ఆయన ఆఫీస్‌కు వెళ్లిన ప్రతీసారి ఏదో రకంగా నన్ను తాకడానికి, ముద్దు పెట్టుకొనేందుకు ప్రయత్నించేవాడు.

  నాపై దారుణంగా కామెంట్లు

  నాపై దారుణంగా కామెంట్లు

  నమస్తే ఇంగ్లండ్ సినిమా కోసం నేను ఆరుసార్లు ఆడిషన్స్‌కు వెళ్లాను. నేను నటనకు పనికిరాను అనే విధంగా కామెంట్లు చేసేవాడు. ఆయన మాటలతో నా కాన్ఫిడెన్స్ దిగజారేది. ఆ తర్వాత తనకు కావాల్సింది ఇచ్చే వరకు, నాతో దగ్గరయ్యేందుకు మాత్రమే ఆడిషన్స్ నిర్వహణ ఎపిసోడ్ కొనసాగించాడని అర్ధమైంది.

  ఆడిషన్స్ పేరుతో ఆరుసార్లు

  ఆడిషన్స్ పేరుతో ఆరుసార్లు

  అర్జున్ కపూర్, పరిణితితో క్లోజ్ కావడానికి పంజాబ్‌లో జరిగిన షెడ్యూల్‌కు రమ్మని చెప్పాడు. ఆక్కడికి వెళ్లిన తర్వాత ఆడిషన్స్ పేరుతో విసిగించాడు. నాతో వర్క్‌షాప్‌లో పాల్గొనమని అడిగాడు. అలా లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆరోగ్యం దెబ్బతిన్నది. దాంతో నేను దేశం విడిచి వెళ్లిపోయాను అని ఇల్నాజ్ నొరౌజీ వెల్లడించింది.

  డిన్నర్‌కు రమ్మని కబురు

  డిన్నర్‌కు రమ్మని కబురు

  నేను ఇరాన్ నుంచి వచ్చిన తర్వాత ఆఫర్ గురించి విపుల్‌ను కలిశాను. అప్పుడు స్క్రిప్టు వినడానికి ఆయన నా రూమ్‌కు రమ్మని అడిగాడు. అక్కడికి వెళితే నాతో దారుణంగా ప్రవర్తించాడు. అతడిని వదిలించుకొని బయటపడ్డాను. ఆ తర్వాత డిన్నర్‌కు రమ్మని అసిస్టెంట్ డైరెక్టర్‌తో కబురు పెట్టారు. ఆ రాత్రి లైంగికంగా దాడి చేసేందుకు ప్రయత్నించాడు అని ఇల్నాజ్ నొరౌజీ ఆవేదన వ్యక్తం చేసింది.

  నమస్తే ఇంగ్లండ్ 18న రిలీజ్

  నమస్తే ఇంగ్లండ్ 18న రిలీజ్

  విపుల్ షా దర్శకత్వం వహించిన నమస్తే ఇంగ్లండ్ సినిమా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, పరిణితి చోప్రాల కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్‌తో పాటు భారీ కలెక్షన్లను సాధిస్తున్నది.

  English summary
  Sacred Games' Elnaaz Norouzi accuses Vipul Shah of sexual harassment during Namaste England auditionsElnaaz Norouzi said that Vipul Shah would try to kiss her on various occasions and grabbed her butt and pulled her towards him when he had called her to Patiala for another audition.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more