twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘‘మా ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదు’’... హీరో సంచలన వ్యాఖ్యలు!

    |

    #మీటూ ఉద్యమం బాలీవుడ్‌తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలో ఉధృతంగా సాగుతోంది. పలువురు నటీమణులు సినీ ప్రముఖుల చీకటి భాగోతాలను దైర్యంగా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ స్పందించారు. తన కూతురు సారా అలీ ఖాన్ సైతం ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో.... ఆయన స్పందిస్తూ మా ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు.

    ఇది అసమానమైన సమాజం. మా ఫ్యామిలీకి చెందిన వారితో ఇండస్ట్రీలో ఎవరైనా మిస్ బిహేవ్ చేస్తారని అనుకోవడం లేదు. నేను ఎందుకు ఇలా ఫీలవుతున్నానో తెలియదు, మా అమ్మ, సోదరి, భార్య ఇండస్ట్రీకి చెందిన వారే. వారితో మిస్ బిహేవ్ చేసే దమ్ము ఇండస్ట్రీలో ఎవరికీ లేదనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు సైఫ్.

    వారి చుట్టూ ఒక రక్షణ వలయం ఉంది

    వారి చుట్టూ ఒక రక్షణ వలయం ఉంది

    నేను ఇలా ఆలోచించడానికి కారణం వారి చుట్టూ ఒక రక్షణ వలయం ఉండటమే కావచ్చు. ఇండస్ట్రీలో వారికి ఉన్న ఫేమ్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇవన్నీ కారణం అయుండొచ్చు... అని సైఫ్ అలీ ఖాన్ అభిప్రాయ పడ్డారు.

    మీటూ ఉద్యమం మంచిదే

    మీటూ ఉద్యమం మంచిదే

    మీటూ ఉద్యమం భవిష్యత్తులోనూ ఉంటుంది. దీనికి ముగింపు అనేది ఉండక పోవచ్చు. ఈ ఉద్యమం చాలా మందికి ఒక కంఫర్ట్‌తో కూడిన వాతావరణం క్రియేట్ చేస్తుంది. ఇది మంచి పరిణామమే అని సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చారు.

    నా రెండేళ్ల కుమారుడిపై అంత ఫోకస్ అవసరమా?

    నా రెండేళ్ల కుమారుడిపై అంత ఫోకస్ అవసరమా?

    దీంతో పాటు ఇండియాలో పెరిగి పోతున్న పాపరాజి కల్చర్(సెలబ్రిటీల వెంటపడి ఫోటోలు తీయడం, వారి వ్యక్తిగత జీవితాన్ని మీడియాకు ఎక్కించడం) గురించి కూడా సైఫ్ అలీ ఖాన్ స్పందించారు. తన రెండేళ్ల కుమారుడు తైమూర్ అలీ ఖాన్ జీవితం మీద కూడా మీడియా ఫోకస్ పెట్టడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని తెలిపారు.

    నాకేం బాధ లేదు కానీ...

    నాకేం బాధ లేదు కానీ...

    తన కుమారుడు తైమూర్ మీద మీడియా అటెన్షన్ ఉండటం వల్ల తానేమీ బాధ పడటం లేదని, అయితే అది లేకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుందని సైఫ్ అభిప్రాయపడ్డారు. అది మీడియాకు నచ్చితే, ప్రజలకు నచ్చితే నాకు ఒకే. అయితే పిల్లల మీద మరీ అంతగా ఫోకస్ పెట్టడం మంచిది కాదు. ఒక లెవరల్ వరకు ఇది బాగానే ఉంటుంది. ప్రజలు ఇది చూసి వారి ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది. మరో లెవల్‌కి వెళితే... ఒక చిన్నపిల్లాడికి పట్ల మరీ ఎందుకు ఇంత అటెన్షన్? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి అని సైఫ్ అభిప్రాయపడ్డారు.

    English summary
    As the rise of #MeToo movement in India has opened many dark spaces of Bollywood, actor Saif Ali Khan, whose daughter Sara Ali Khan is gearing up for her Bollywood debut, feels no one has the guts to mess with his family members.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X