ఆ స్టార్ హీరోని వాడుకున్న లేడీ ప్రొడ్యూసర్.. ఒక్కో ముద్దుకు రేటు కట్టి
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు.. ఇండస్ట్రీలోనూ కొనసాగడం కూడా అంత తేలిక కాదు. మహామహులే ఇక్కడ ప్రయాణం కష్టమని గ్రహించి వెళ్లిపోయారు. కానీ చివరి వరకు నిలబడిన వారు మాత్రం స్టార్లుగా వెలుగొందుతున్నారు. వేల కోట్ల ఆస్తులను వదులుకుని సినిమాల్లో వెలిగిపోవాలని వచ్చిన ఓ నటుడు బిగినింగ్ డేస్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, కష్టాలకు తట్టుకుని ఇప్పుడు స్టార్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ హీరో ఎవరు? ఆయన ఏ కష్టాలు పడ్డాడో చూస్తే..
పరంపరతో ఇండస్ట్రీలోకి
పటౌడీ వారసుడు, రాజవంశీకుడు సైఫ్ అలీఖాన్ .. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. వేల కోట్లకు అధిపతి, తండ్రి క్రికెటర్, తల్లి స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఎన్నో కష్టాలు పడ్డారు సైఫ్. 1993లో పరంపర అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు సైఫ్ అలీఖాన్. బాలీవుడ్ దిగ్గజం యశ్ రాజ్ చోప్రా ఈ సినిమాకు దర్శకుడు కాగా.. ఇందులో సునీల్ దత్, వినోద్ ఖన్నా, అమీర్ ఖాన్ వంటి హేమాహేమీలు నటించారు. ఆ తర్వాత చిన్నా చితకా పాత్రలకు సైతం అంగీకరిస్తూ ఫుల్ టైం హీరోగా ఎదిగారు సైఫ్ అలీఖాన్. వరుస హిట్లతో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు సైఫ్ అలీఖాన్. జాతీయ చలన చిత్ర అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌తో పాటు భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను అత్యున్నత పద్మశ్రీ పురస్కారంతోనూ సైఫ్ అలీఖాన్‌ను సత్కరించింది భారత ప్రభుత్వం.

రెండు పెళ్లిళ్లు, నలుగురు పిల్లలు
తొలుత అప్పటి స్టార్ హీరోయిన్ అమృతా సింగ్‌తో ప్రేమలో పడి ఆమెను పెళ్లాడారు సైఫ్ అలీఖాన్. వీరికి ఇబ్రహీం అలీఖాన్, సారా అలీఖాన్ సంతానం. అనివార్య కారణాలతో ఈ దంపతులు విడాకులు తీసుకోగా.. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఈ క్రమంలో పెద్దల అంగీకారంతో అక్టోబర్ 16, 2012లో ఈ జంట ఒక్కటైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. తైమూర్ అలీఖాన్, జహంగీర్ అలీఖాన్. అమృతా సింగ్‌తో విడాకుల తర్వాత తన జీవితంలోకి వచ్చిన కరీనా తనకు అన్ని రకాలుగా అండగా నిలిచిందని సైఫ్ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. కరీనా కపూర్ మల్టీ టాస్కర్ అని.. ఆమెకు ఏ విషయంలోనూ సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయనని ఆయన అన్నారు.
దేవరతో టాలీవుడ్ ఎంట్రీ
దేవరతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులను పలకరించారు సైఫ్ అలీఖాన్. ప్రస్తుతం హైవాన్, జిస్మ్ 3 చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి బంగ్లాదేశ్‌కు చెందిన దుండగుడు చొరబడి ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రగాయాల పాలవ్వగా.. చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్ అలీఖాన్ .. తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన కష్టాల గురించి వెల్లడించారు.
ముద్దు పెడితేనే డబ్బులు
బలమైన సినిమా నేపథ్యం ఉన్నప్పటికీ తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డానని సైఫ్ అలీఖాన్ వెల్లడించారు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ ప్రతిభ లేకపోతే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు మనుగడ సాగించలేమని సైఫ్ అలీఖాన్ పేర్కొన్నారు. ఇక కెరీర్ ప్రారంభంలో తనకు ఛాన్సులు అంతగా రాకపోవడంతో ఓ మహిళా నిర్మాత తనకు పాకెట్ మనీ ఇచ్చేవారని.. ఇందుకోసం ఆమె ఓ షరతు పెట్టారని సైఫ్ చెప్పారు. తన బుగ్గలపై ముద్దుపెడితేనే డబ్బులు ఇస్తానని చెప్పేదని.. అలా 10 ముద్దులు పెట్టినందుకు వారానికి 1000 రూపాలు ఇచ్చేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. ఆయనతో ముద్దులు పెట్టించుకున్న మహిళా నిర్మాత ఎవరన్నది ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











