»   » సల్మాన్‌ ఖాన్‌కు బెయిల్.. జోధ్‌పూర్ జైలుకు లాయర్ల పరుగులు.. సూర్యాస్తమయం అయితే!

సల్మాన్‌ ఖాన్‌కు బెయిల్.. జోధ్‌పూర్ జైలుకు లాయర్ల పరుగులు.. సూర్యాస్తమయం అయితే!

Posted By:
Subscribe to Filmibeat Telugu
సల్మాన్‌ బెయిల్‌ పిటషన్‌పై విచారణ ,బెయిల్‌ మంజూరు

కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. 1998 సంవత్సరంలో నమోదైన ఈ కేసులో సల్మాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్షతోపాటు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

జోధ్‌పూర్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎగువ కోర్టుకు అప్పీల్ చేస్తున్న నేపథ్యంలో సల్మాన్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం (ఏప్రిల్ 7వ తేదీన) పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి సల్మాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేశారు. 25 వేల రూపాయల చొప్పన రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

జోధ్‌పూర్ జైలుకు పరుగులు

జోధ్‌పూర్ జైలుకు పరుగులు

సల్మాన్ ఖాన్‌కు బెయిల్ లభించిన నేపథ్యంలో శనివారమే ఆయనను జైలు నుంచి రిలీజ్ చేయడానికి న్యాయవాదులు ప్రయత్నాలు చేపట్టారు. బెయిల్ మంజూరు చేయగానే న్యాయవాదులు జోధ్‌పూర్ కోర్టుకు పరుగులు పెట్టారు. బెయిల్ మంజూరుకు కావాల్సిన పత్రాలను సమర్పించే పనిలో న్యాయవాదులు నిమగ్నమయ్యారు.

 సూర్యాస్తమయం తర్వాత సల్మాన్..

సూర్యాస్తమయం తర్వాత సల్మాన్..

జైలు నిబంధనల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఖైదీలను విడుదల చేయకూడదు. ఒకవేళ గడుపులోపల పత్రాలను సమర్పించకపోతే సల్మాన్ ఖాన్ మరో రోజు జోధ్‌పూర్ జైలులోనే ఉండాల్సి వస్తుంది. దాంతో డాక్యుమెంట్ల సమర్పణ పనిని లాయర్లు వేగం చేశారు. ఈ ప్రక్రియ అంతా సవ్యంగా సాగితే కొద్ది గంటల్లో సల్మాన్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

 విడుదలపై సందేహం లేదు

విడుదలపై సందేహం లేదు

సల్మాన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. ఖచ్చితంగా ఈ రోజే జైలు నుంచి విడుదల అవుతారు. సాయంత్రం 6 గంటల లోపే రిలీజ్ అవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు అని న్యాయవాది మహేష్ బోరా వెల్లడించారు. సల్మాన్ తరఫున బోరా తన వాదనలు వినిపించారు.

సల్మాన్ ఖాన్ అమాయకుడు

సల్మాన్ ఖాన్ అమాయకుడు

కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్‌ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు. ఈ కేసుతో ఆయనకు సంబంధం లేదు. సల్మాన్ అమాయకుడు. ఎగువు కోర్టులో సల్మాన్ నిర్దోషి అని తెలితే ఇన్ని రోజులు జైలులో ఉన్నందుకు ఎవరు బాధ్యత వహిస్తారు అని సల్మాన్ తరఫు న్యాయవాది మహేష్ బోరా వాదనలు వినిపించారు.

English summary
Salman Khan was today granted bail in a 19-year-old blackbuck poaching case, in which the actor was convicted and jailed earlier this week. The Jodhpur sessions court ruled in favour of Salman Khan's bail plea today afternoon. The actor will have to produce two surety bonds of Rs 25,000 each, following which he will be released from jail.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X