»   » గణేష్ చతుర్థి వేడుకలో సందడి చేసిన సల్మాన్, కత్రినా (ఫోటోస్)

గణేష్ చతుర్థి వేడుకలో సందడి చేసిన సల్మాన్, కత్రినా (ఫోటోస్)

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సల్మాన్ ఖాన్ ఫ్యామిలీలో ఆయన సోదరి అర్పిత ఖాన్ ప్రతి ఏడాది గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇన్నేళ్లు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంటులో జరిగిన ఈ వేడుకలు ఈ సారి అర్పిత ఖాన్ కొత్తగా ఏర్పాటు చేసుకున్న నివాసంలో నిర్వహించారు. ఈ వేడుకలో సల్మాన్ ఖాన్‌ ఫ్యామిలీతో పాటు కత్రినా కైఫ్, లులియా వంటూర్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు విభేదాలతో విడిపోయిన సల్మాన్-కత్రినా మళ్లీ కలిసి పోయి గణేష్ చతుర్థి వేడుకలో పాల్గొనడంపై అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

  సల్మాన్ ఖాన్

  సల్మాన్ ఖాన్

  గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొనేందుకు తన సోదరి అర్పిత ఖాన్ శర్మ నివాసానికి వస్తున్న సల్మాన్ ఖాన్. సల్మాన్ తండ్రి ముస్లిం అయినప్పటికీ ఆయన తల్లి హిందూ కావడంతో సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు రెండు మతాలకు చెందిన పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారు.

  సోదరితో కలిసి కత్రినా

  సోదరితో కలిసి కత్రినా

  బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తన సోదరి ఇసబెల్లె కైఫ్‌తో కలిసి అర్పిత ఖాన్ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో సాంప్రదాయ దుస్తుల్లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇసబెల్లె కూడా త్వరలో నటిగా పరిచయం కాబోతోంది. సూరజ్ పంచోలి హీరోగా తెరకెక్కుతున్న మూవీ ద్వారా ఆమె తెరంగ్రేటం చేయబోతోంది.

   లూలియా వంటూర్

  లూలియా వంటూర్

  ఒకప్పుడు సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండుగా వార్తల్లోకెక్కిన విదేశీ బ్యూటీ లూలియా వంటూర్ కూడా అర్పిత ఖాన్ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో దర్శనమిచ్చారు. గతంలో సల్మాన్-లులియా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

   కత్రినా, యాస్మిన్, అల్విరా

  కత్రినా, యాస్మిన్, అల్విరా

  గణేష్ చతుర్థి వేడుకలో సల్మాన్ ఖాన్ సోదరి అల్విరా అగ్నిహోత్రితో కలిసి బాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా, కల్రినా కైఫ్.

  సందడే సందడి

  సందడే సందడి

  అర్పిత ఖాన్ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలో సల్మాల్ ఖాన్ ఫ్యామిలీతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

  English summary
  Ever since Salman Khan and Katrina Kaif have reconciled, fans want them to get back to each other as a couple. We don't know if it is ever going to happen, but the latest spotting of the ex-lovers has all their fans screaming with happiness. Salman and Katrina turn up at Arpita Khan Sharma's residence for Ganesh darshan and their fans just can't keep calm. Dressed in a simple black kurta, Salman Khan looked dapper, while Katrina Kaif chose a blood red kurta for the celebration and we gotta say that she nailed the traditional look!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more