For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ షోలో కరోనా కలకలం: ఐసోలేషన్‌లో హోస్ట్.. వచ్చే వారం మరో స్టార్ హీరో ఎంట్రీ.!

  |

  బిగ్ బాస్.. దేశంలోని అన్ని భాషల్లోకెల్లా సక్సెస్‌ఫుల్ అయిన షో. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా రూపొందిన దీనిని మొదటిగా 2006లో హిందీలో ప్రారంభించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా మొదలైనప్పటికీ.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని సూపర్ హిట్ అయింది. అలా అలా ఇప్పుడు దేశంలోని చాలా భాషల్లో ఈ రియాలిటీ షో ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ షోలో కరోనా వైరస్ కలకలం రేపింది.

  ఫలితంగా ప్రస్తుత సీజన్‌ నుంచి హోస్ట్ కూడా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే, ఆయన స్థానంలో మరో స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

  ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం

  ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం

  కొద్ది నెలలుగా భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాదిలా ఈ సారి అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ ప్రసారం అయ్యే అవకాశాలు లేవని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఈ షో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందుకోసం షో నిర్వహకులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు.

  అక్కడ మాత్రం ప్రత్యేకంగా మొదలైంది

  అక్కడ మాత్రం ప్రత్యేకంగా మొదలైంది

  అన్ని భాషలతో పోలిస్తే హిందీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. అందుకే ఈ షో ఏకంగా పదమూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, కరోనా ప్రభావంతో పద్నాలుగో సీజన్‌ కోసం షో యూనిట్ ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ సెట్‌ను కూడా హోస్ట్ సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో నిర్మించారు.

  సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టిన హోస్ట్

  సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టిన హోస్ట్

  బిగ్ బాస్ అంటే ఎంత ప్రత్యేకమైన షోనో అందరికీ తెలిసిందే. అందుకే ఇందులో హోస్ట్‌గా పని చేసే హీరో కూడా స్పెషల్‌గానే ఉండాలి. హుందాగా వ్యవహరించాలి. అందుకే హిందీలో సల్లూ భాయ్‌నే హోస్ట్‌గా కొనసాగిస్తున్నారు. ఇక, ఈ సీజన్‌లో ఇన్‌విజుబుల్ కంటెస్టెంట్ అనే కొత్త ప్రయోగం చేశారు. దీని ప్రకారం.. ఓట్లు తక్కువ వచ్చిన వ్యక్తి హౌస్‌లో ఉన్నా లేనట్టే వ్యవహరించాలి.

  బిగ్ బాస్ షోలో కలకలం రేపిన కరోనా

  బిగ్ బాస్ షోలో కలకలం రేపిన కరోనా

  కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నా బిగ్ బాస్ షోలు అన్ని భాషల్లోనూ ఏమాత్రం ఆటంకం లేకుండా ప్రసారం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా హిందీలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో నిర్వరామంగా షో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హిందీ బిగ్ బాస్ షోలో కరోనా వైరస్ కలకలం రేపింది. దీంతో పద్నాలుగో సీజన్ మనుగడపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

  ముగ్గురికి కరోనా.. ఐసోలేషన్‌లో హోస్ట్

  ముగ్గురికి కరోనా.. ఐసోలేషన్‌లో హోస్ట్

  బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్.. కారు డ్రైవర్‌తో పాటు అతడి సహాయక సిబ్బందిలోని ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో సల్లూ భాయ్, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఐసోలేషన్‌‌లోకి వెళ్లారు. కాగా, కరోనా వైరస్ సోకిన సిబ్బందిని ముంబైలోని ప్రముఖ హాస్పిటల్‌లో చేర్పించి, చికిత్స అందేలా చూస్తున్నాడీ స్టార్ హీరో.

  SP Balasubrahmanyam డబ్బింగ్ చెప్పిన మొదటి చిత్రం ఇదే, దశావతారం చిత్రం హైలైట్
  వచ్చే వారం మరో స్టార్ హీరో ఎంట్రీ.!

  వచ్చే వారం మరో స్టార్ హీరో ఎంట్రీ.!

  సల్మాన్ ఖాన్ 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండడనున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే వారం అతడు బిగ్ బాస్ షోకు గైర్హాజరు కానున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, సల్లూ భాయ్ స్థానంలో మరో హీరోను తీసుకు వచ్చేందుకు షో నిర్వహకులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సల్మాన్ ‘రాధే' అనే మూవీలో నటిస్తున్నాడు.

  English summary
  Actor Salman Khan has gone into self-isolation after his driver and two of his staff members tested positive for the novel coronavirus. The staff members are being treated in a Mumbai hospital.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X