సికందర్, మదరాసి డిజాస్టర్లు అందుకేనా? మురగదాస్‌పై సల్మాన్ ఖాన్ ఘాటైన వ్యాఖ్యలు!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాను నటించిన సికందర్ చిత్ర దర్శకుడు ఏఆర్ మురగదాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సికందర్ సినిమా ఫ్లాప్ నేపథ్యంలో గతంలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసి ఘాటైన సమాధానం ఇచ్చాడు. బిగ్‌బాస్ 19వ వేదిక వద్ద మ్యూజిక్ డైరెక్టర్‌తో జరిగిన సంభాషణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మురగదాస్‌పై సుతిమెత్తని విమర్శలు చేశారు. అయితే గతంలో మురగదాస్ ఏం కామెంట్స్ చేశాడు? సికందర్ షూటింగ్ విషయంలో ఏం జరిగింది? మదరాసి సినిమా గురించి సల్మాన్ ఖాన్ ఏం కామెంట్ చేశాడు అనే వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో గత కొద్ది నెలల క్రితం వచ్చిన సికందర్ చిత్రం సల్మాన్, మురగదాస్ కాంబినేషన్‌లో రూపొందింది. రష్మిక మందన్న నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ఫెయిల్యూర్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో మదరాసి అనే చిత్రం వచ్చింది. ఆ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆయన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

మదరాసి సినిమా ప్రమోషన్స్‌లో సికందర్ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను ఏఆర్ మురగదాస్ విశ్లేషిస్తూ.. సెట్‌లో స్క్రిప్ట్ రైటర్లు ఎప్పటికప్పుడు స్టోరిని మార్చుతుండే వారు. తన ప్రమేయం లేకుండా డైలాగ్స్, సన్నివేశాలను మార్చే వారు. ఇక సల్మాన్ ఖాన్ మాత్రం రాత్రి 9 గంటల ప్రాంతంలో షూటింగ్‌కు వచ్చేవాడు. హిందీలో హీరోలు సకాలంలో షూటింగ్‌కు రారు. స్టోరి డిమాండ్ మేరకు వారు నటించరు అనే విధంగా కామెంట్ చేశాడు.
అయితే బిగ్‌బాస్ 19 షోలో ఓ సినీ జర్నలిస్ట్ రవితో సికందర్ సినిమా గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి, మురగదాస్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సికందర్ సినిమాలో నేను బాగా నటించానని అందరూ అంటుంటారు. కానీ కథ బాగుంటుంది. కానీ సెట్‌కు, షూటింగ్‌కు ఆలస్యంగా అంటే.. రాత్రి 9 గంటలకు వెళ్లేవాడిని. దాంతో కొంత గందరగోళం ఏర్పడింది మా డైరెక్టర్ కామెంట్ చేశాడు అని గుర్తు చేశాడు.
కానీ సికిందర్ మూవీ డైరెక్టర్ తీసిన మరో సినిమా ఇటీవల రిలీజైంది. మదరాసి చిత్రం ఇటీవల రిలీజైంది. ఆ సినిమాలో నటించిన హీరో ఉదయం 6 గంటలకే సెట్‌కు, షూటింగ్‌కు వెళ్లేవాడు. కానీ ఆ మూవీ సికందర్ కంటే భారీగా అంటూ సెటైర్ వేశాడు. సికందర్ సినిమాకు సాజిద్, ఏ మురగదాస్ సినిమా అని ముందుగా వేసుకొన్నారు. ఆ తర్వాత మురగదాస్ సినిమా అంటూ సోలోగా క్రెడిట్ తీసుకొన్నాడు అని సల్మాన్ సెటైర్ల మీద సెటైర్లు వదిలాడు.
సికందర్ సినిమా కంటే పెద్దగా బ్లాక్ బస్టర్ అయింది. ఈ విషయంలో నేను నీకు మంచి మసాలా ఇస్తాను. ఆయన ఉదయం 9 గంటల నుంచి పనిచేసి సినిమాను ఎంత పెద్ద హిట్ చేశాడో అందరికి తెలుసు అంటూ పంచ్ వేశాడు. అంతేకాకుండా దబాంగ్ దర్శకుడిపై కూడా ఆయన సెటైర్లు వేశాడు. ఆయన మంచి డైరెక్టర్. కాకపోతే అనవసరపు విషయాలు మాట్లాడుతుంటాడు. దాని వల్ల స్నేహాన్ని కోల్పోతాడు. అలాగే ఇక ముందు ఆయనతో పనిచేయాలనిఅనుకొన్న వారు కూడా చేయకుండా ఆగిపోతారు అని సల్మాన్ అన్నాడు.


Click it and Unblock the Notifications











