»   » ఊచలు లెక్కపెట్టనున్న సల్మాన్.. ఈ రాత్రికి జైలులోనే..

ఊచలు లెక్కపెట్టనున్న సల్మాన్.. ఈ రాత్రికి జైలులోనే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ దోషిగా తేలాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల జైలుశిక్షతోపాటు 10 వేల రూపాయల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. జోధ్‌పూర్ కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో ఈ రాత్రికి సల్మాన్ ఖాన్ జైలులోనే గడుపనున్నారు.

1998 నాటి జరిగిన ఈ సంఘటనలో బాలీవుడ్ నటులు సైఫ్ ఆలీ ఖాన్, టబు, సొనాలి బింద్రే, నీలమ్, దుష్యంత్ సింగ్ తదితరులు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. జోధ్‌పూర్‌కు చెందిన బిష్ణోయ్ కమ్యూనిటీ వీరిపై కేసు నమోదు చేసింది.

Salman Khan will spend night in prison

కృష్ణ జింకల కేసులో సల్మాన్ ఖాన్‌కు గతంలో ట్రయల్ నిర్ధోషిగా ప్రకటించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బిష్ణోయ్ కమ్యూనిటి జిల్లా కోర్టులో అప్పీల్ చేసింది. దాంతో తిరిగి విచారణ చేపట్టారు.

Salman Khan will spend night in prison

కృష్ణ జింకల కేసులో దోషిగా నిర్ధారింపబడిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ బెయిల్ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోనున్నారు. గురువారం బెయిల్ లభించని నేపథ్యంలో జోధ్‌పూర్ జైలులో సల్మాన్ ఖాన్ గడుపనున్నారు.

English summary
Bollywood icon Salman Khan has been sentenced to five years in jail after a court in Jodhpur convicted him of killing two blackbucks 19 years ago. He has also been slapped with a fine of Rs 10,000. Salman will now have to approach the Rajasthan High Court in order to get bail since his punishment exceeds three years, meaning he will spend tonight in jail.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X