»   » సల్మాన్ ఖాన్ జైల్లో డీలా పండింది ఆమె గురించే.. రెండు రోజులు ఇలా!

సల్మాన్ ఖాన్ జైల్లో డీలా పండింది ఆమె గురించే.. రెండు రోజులు ఇలా!

Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు కృష్ణ జింకల కేసులో జోధ్ పూర్ న్యాయస్థానం ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనితో సల్మాన్ ఖాన్ కుటుంబం బాధతో కుంగిపోయింది. రెండు రోజుల అనంతరం సల్మాన్ ఖాన్ కు బెయిల్ లభించడంతో ఊరట లభించింది. కాగా ఈ రెండు రోజుల పాటు సల్మాన్ ఖాన్ జైల్లో ఎలా గడిపాడో జైళ్ల శాఖ డిఐజి విక్రమ్ సింగ్ వివరించారు. మొదట సల్మాన్ ఖాన్ లో ఆందోళన కనిపించిందని ఆ తరువాత ఆయన కురుకుకునట్లు విక్రమ్ సింగ్ తెలిపారు.

సల్మాన్ ఖాన్ ఈ రెండు రోజుల పాటు తన తల్లి గురించే ఎక్కువగా దిగులు పడ్డాడని విక్రమ్ సింగ్ వివరించాడు. సల్మాన్ ఖాన్ జైలుకు వచ్చే సమయంలో ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయం తెలిస్తే మరింతగా ఆరోగ్యం క్షీణిస్తుందని సల్మాన్ దిగులుచెందాడట. సల్మాన్ ఖాన్ జైల్లో ఉన్న సమయంలో అతడి చెల్లెల్లు అల్విరా, అర్పితా, హీరోయిన్ ప్రీతి జింతా పరామర్శించినట్లు ఆయన తెలిపారు.

Salman Khan worried about his mother at jail.

సల్మాన్ కు బెయిల్ వచ్చిన తరువాత కూడా ఆయన ముఖంలో ఎటువంటి సంతోషం కనిపించలేదని విక్రమ్ సింగ్ తెలిపారు. త్వరగా స్నానం చేసి ఆయన వస్తువులని ప్యాక్ చేసుకున్నట్లు డిఐజి వెల్లడించారు. కృష్ణ జింకల కేసులో జోధ్ పూర్ న్యాయస్థానం సల్మాన్ ఖాన్ కు ఐదేళ్లు శిక్ష విధించింది. రెండు రోజుల శిక్ష అనంతరం సల్మాన్ కు బెయిల్ రావడం విశేషం.

English summary
Salman Khan worried about his mother at jail.He is not happy even after got bail.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X