»   » 'కాస్టింగ్ కౌచ్' నాకూ తప్పలేదు, 'కాంప్రమైజ్' అంటే అదే?: సనాఖాన్

'కాస్టింగ్ కౌచ్' నాకూ తప్పలేదు, 'కాంప్రమైజ్' అంటే అదే?: సనాఖాన్

Subscribe to Filmibeat Telugu
ఇండస్ట్రీలో 'కాస్టింగ్ కౌచ్' : హోటల్స్‌కు రమ్మంటారు, 'కాంప్రమైజ్' అవ్వాల్సిందే !

హాలీవుడ్ నుంచి బాలీవుడ్, టాలీవుడ్ దాకా ఇప్పుడెక్కడ విన్నా.. 'కాస్టింగ్ కౌచ్' గురించే చర్చ. లైంగిక వేధింపులపై హాలీవుడ్ లో మొదలైన మీటూ క్యాంపెయిన్ లో భాగంగా.. ఆయా ఇండస్ట్రీల హీరోయిన్లు దీనిపై ఇప్పుడిప్పుడే పెదవి విప్పుతున్నారు. అవకాశాల కోసం 'కాంప్రమైజ్' అవక తప్పదన్న మాటలే ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటాయని, ఆ కాంప్రమైజ్‌కు అర్థాలు వేరుగా ఉంటాయని వారు చెబుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ కూడా తాజాగా దీనిపై స్పందించారు. సినిమాల్లోకి వచ్చాక తనకూ ఇలాంటి అనుభవాలు తప్పలేదని వెల్లడించారు..

క్యాస్టింగ్ కౌచ్‌పై విజయ్ దేవరకొండ హీరోయిన్.. బ్యాగ్‌లో కత్తి పెట్టుకొని తిరిగా..

ఇండస్ట్రీలో ఉంటూ..

ఇండస్ట్రీలో ఉంటూ..

'సముద్రంలోనే ఉండి షార్క్‌లతో పోరాడటం కష్టం' అని సనాఖాన్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంటే, ఇండస్ట్రీలో ఉంటూ కొంతమందికి వ్యతిరేకంగా నోరు విప్పడం కష్టం అని ఆమె పరోక్షంగా చెప్పుకొచ్చారన్నమాట.

 అవకాశాలు కోల్పోతారన్న భయం..

అవకాశాలు కోల్పోతారన్న భయం..

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లాంటి విషయాల గురించి ప్రస్తావించి.. తమ అవకాశాలను వదులుకోవడానికి చాలామంది నటీమణులు సిద్దంగా లేరని సనాఖాన్ చెప్పడం గమనార్హం. వ్యక్తుల పేర్లు బయటపెట్టడం ద్వారా.. వారిపై నేరుగా విమర్శలు గుప్పించడం ద్వారా వాళ్లకంటే ఎక్కువ నటులే నష్టపోతారన్న రీతిలో ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మంచివాళ్లూ ఉన్నారు..

మంచివాళ్లూ ఉన్నారు..

'ఇండస్ట్రీలో అంతా దిగజారుడు వ్యక్తులే ఉంటారని చెప్పడానికి లేదు. కొంతమంది మంచివాళ్లు కూడా ఉన్నారు. కాబట్టి చీప్ పర్సనాలిటీల గురించి పట్టించుకోకుండా ప్రతీసారి నమ్మకంతో ముందుడగు వేయాల్సిందే. ఎవరి పేరో ప్రస్తావించి వివాదంలో ఇరుక్కోవడం ఎందుకు?' అంటూ సనాఖాన్ అభిప్రాయపడ్డారు.

వివాదంలో ఇరుక్కుంటే టాలెంట్ పట్టించుకోరు..

వివాదంలో ఇరుక్కుంటే టాలెంట్ పట్టించుకోరు..

ఒకవేళ ఇండస్ట్రీలో 'కాస్టింగ్ కౌచ్'కు సంబంధించి ఎవరినైనా వేలెత్తి చూపితే.. ఆ తర్వాత జనమంతా వివాదం గురించి ఎక్కువగా తమ టాలెంట్ గురించి తక్కువగా మాట్లాడుతారని సనాఖాన్ అన్నారు. మనం మంచివాళ్లు అనుకునేవారు సైతం దురదృష్టవశాత్తు ఆ సమయంలో మనకు అవకాశాలు కూడా ఇవ్వరు అని సనాఖాన్ చెప్పుకొచ్చారు.

నాకూ తప్పలేదు..

నాకూ తప్పలేదు..

మీరెప్పుడైనా 'కాస్టింగ్ కౌచ్' పరిస్థితిని ఎదుర్కొన్నారా? అని ప్రశ్నించగా.. 'తప్పదు, చాలాసార్లు అలాంటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి కొంతమంది ప్రయత్నించారు. ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని బయటి వ్యక్తుల నుంచే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని నేను అనుకుంటాను.' అని సనాఖాన్ బదులిచ్చారు.

 'కాంప్రమైజ్' కావాలంటారు..

'కాంప్రమైజ్' కావాలంటారు..

'ఇండస్ట్రీలో అవకాశాలు మొదలైన తర్వాత.. కొంతమంది కో-ఆర్డినేటర్స్‌ను కలవాల్సి ఉంటుంది. వారు మిమ్మల్ని హోటల్స్‌కు రమ్మంటారు. ఇంకా ఏవేవో అడుగుతారు. కొన్ని నెలలు లేదా సంవత్సరం తర్వాత గానీ మన చుట్టూ ఇంతమంది దిగజారుడు వ్యక్తులు ఉన్నారా? అన్న విషయం అర్థం కాదు. వాళ్లంతా మిమ్మల్ని 'కాంప్రమైజ్' కావాలని చెబుతారు. స్కూల్లో నేర్చుకున్న కాంప్రమైజ్‌కు ఇక్కడ వినే కాంప్రమైజ్‌కు చాలా తేడా ఉంటుంది' అని ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి వివరించారు.

ఆ మాటలకు అర్థాలే వేరు..

ఆ మాటలకు అర్థాలే వేరు..

'మొదట్లో నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. చాలాసార్లు వాళ్లనే(కో-ఆర్డినేటర్స్) దేని గురించి మాట్లాడుతున్నారని అడిగేదాన్ని. ఒకే పదాన్ని వివిధ సందర్భాల్లో ద్వంద్వార్థాలతో వాడటం చూసి నేను ఆశ్చర్యపోయేదాన్ని. ఇదే విషయమై నా సహచర నటి ఒకరితో మాట్లాడినప్పుడు మరిన్ని పదాలు ఇలాంటివే విన్నాను. 'నువ్వు అందరి వద్దకు వెళ్లి కలుస్తుండాలి. వారితో కలిసి పనిచేయాలనుకుంటున్నానని చెప్పాలి', 'వర్క్ చేయాలంటే మంచి రిలేషన్ షిప్ కొనసాగించాలి' లాంటి మాటలు చాలానే విన్నాను.' అని సనాఖాన్ వెల్లడించారు.

English summary
It’s been quite some time since the Harvey Weinstein scandal broke in Hollywood and triggered many Bollywood actors, too, to admit that casting couch exists in the Hindi film industry as well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu