»   » జీవితంలో విసిగి పోయి.. తండ్రిని కోల్పోయి.. డాబాలో పనిచేస్తున్న నటుడు!

జీవితంలో విసిగి పోయి.. తండ్రిని కోల్పోయి.. డాబాలో పనిచేస్తున్న నటుడు!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Bollywood Actor Talks About His Pathetic Situation

  బాలీవుడ్‌లో విలక్షణమైన నటుల్లో సంజయ్ మిశ్రా ఒకరు. పాత్ర ఏదైనా గానీ తనదైన శైలిలో నటించి మెప్పించడం సంజయ్ బలం. కొద్దికాలంగా ఆయన జీవితంలో చోటుచేసుకొన్న విషాద సంఘటనలతో చెలించిపోయారు. బాలీవుడ్, బాహ్య ప్రపంచానికి దూరంగా వెళ్లి బ్రతకాలని రుషికేష్‌కు వెళ్లిపోయాడు. అక్కడ డాబాలో పనిచేస్తూ కాలం గడిపాడు. ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే....

   తండ్రి మరణంతో విషాదంలోకి

  తండ్రి మరణంతో విషాదంలోకి

  నా జీవితంలో ఎన్నడూ లేని విధంగా చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నట్టుంది అనారోగ్యానికి గురయ్యాను. కొన్ని గంటలకు మించి బతకడని వైద్యులు తేల్చేశారు. అప్పుడు నన్ను నా తండ్రి జేబీ పంత్ హాస్పిటల్‌కు తరలించాడు. నెలరోజుల్లో నేను పూర్తిగా కోలుకొన్నాను. కానీ నా తండ్రి నన్ను విడిచి ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు.

   చివరి కోరిక కోసం

  చివరి కోరిక కోసం

  నా తండ్రి నాకు దూరం కావడంతో విషాదంలో మునిగిపోయాను. ఆయన చివరి కోరిక ప్రకారం ధూమ, మద్యపానం పూర్తిగా మానేయాలని అనుకొన్నాను. నాకు ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్‌తో నేను వాటిని వదులుకోలేనని అనుకొన్నాను. అందుకే ఒంటరిగా, చేతిలో చిల్లిగవ్వ లేకుండా రుషికేష్‌కు వచ్చాను.

   రుషికేష్ డాబాలో ఉద్యోగం

  రుషికేష్ డాబాలో ఉద్యోగం

  రుషికేష్‌లో ఓ ముసలి వ్యక్తికి డాబా నడపడానికి ఓ వ్యక్తి సాయం కావాల్సింది. దాంతో నేను అక్కడ ఉద్యోగానికి కుదిరాను. ఓ డాబాలో పనిచేయడం ప్రారంభించాను. కొద్దిరోజుల్లోనే డాబా నుంచి ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని సంజయ్ చెప్పాడు.

  నా దురదృష్టం వెంటాడిందలా

  నా దురదృష్టం వెంటాడిందలా

  రుషికేష్ డాబాలో పనిచేస్తుంటే అక్కడ కూడా దురదృష్టం నన్ను వెంటాడింది. నేను నటించిన ఆఫీస్ ఆఫీస్ టీవీలో వేశారు. అప్పుడే గోల్‌మాల్, ధమాల్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. జనం అందరూ నన్ను గుర్తించి మాట్లాడటం చేశారు. దాంతో నా యజమాని భయం పట్టుకొన్నది. ఉద్యోగం నుంచి తీసేశాడు. దాంతో మరో ఉద్యోగం కోసి వెతుకుతున్నాను అని సంజయ్ చెప్పారు.

   నట జీవితం సంతృప్తికరంగా

  నట జీవితం సంతృప్తికరంగా

  చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం అంగ్రేజీ మే కహ్తే హై అనే చిత్రంలో నటిస్తున్నాను. అదో మంచి ప్రేమ కథా చిత్రం. అలాగే కడ్వి హవా చిత్రంలో నటించడం ఓ గొప్ప అనుభూతి. నటుడిగా నా జీవితం సంత‌ృప్తికరంగా ఉంది. కానీ జీవితంలోని ఆటుపోట్లు బాధిస్తున్నాయి. ఉపశమనం కోసం ఇలా జీవితాన్ని మరో మలుపు తిప్పాను అని సంజయ్ వెల్లడించారు. సంజయ్ నటించిన అంగ్రేజీ మే కహ్తే హై చిత్రం మే 18న రిలీజ్ అవుతున్నది.

  English summary
  Bollywood actor Sanjai Mishra, who will next be seen in Angrezi Mein Kehte Hain, talks about his experiences in the film industry. Sanjai Mishra is one of the most versatile actors in Bollywood with a diverse body of work behind him. However, a few years ago, the actor was so disillusioned that he wanted to give it all up and actually went to Rishikesh where he started working at a dhaba.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more