For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సంజయ్ దత్‌పై 735 కోట్లు.. నిర్మాతల గుండెల్లో రైళ్లు.. సంజూకు ఎలాంటి క్యాన్సర్ అంటే!

  |

  బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కు క్యాన్సర్ వ్యాధి సోకిందనే వార్తలు అభిమానులను, సినీ ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేశాయి. గత కొద్దికాలంగా ఆయన వ్యక్తిగత జీవితంలోని సమస్యలను సానుకూలంగా ఎదురించి ఇప్పుడిప్పుడే లైఫ్, కెరీర్‌ను ఓ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఆయనకు విధి మరో పరీక్షను ముందుంచింది. ఇలాంటి నేపథ్యంలో సంజయ్ దత్ లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

  డాక్టర్ జలీల్ పార్కర్ పర్యవేక్షణలో

  డాక్టర్ జలీల్ పార్కర్ పర్యవేక్షణలో

  ఆగస్టు 8వ తేదీన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేరడంతో అంతా సవ్యంగానే ఉందని భావించారు. పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల అస్వస్థతకు గురై ఉంటారనే భావనలో ఉన్న వారికి సంజయ్ క్యాన్సర్ బారిన పడ్డారనే భయంకర విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం డాక్టర్ జలీల్ పార్కర్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది.

  సంజయ్ దత్‌కు సోకిన క్యాన్సర్ ఎలాంటిందంటే

  సంజయ్ దత్‌కు సోకిన క్యాన్సర్ ఎలాంటిందంటే

  అయితే సంజయ్ దత్‌కు వెంటాడుతున్న క్యాన్సర్ ఎలాంటిందనే ప్రశ్నలకు వైద్యులు తాజాగా వివరణ ఇచ్చారు. అడెనోకారసినోమా అనే క్యాన్సర్‌ శరీరంలోని గ్రంధుల్లో ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల్లో ఇలాంటి క్యాన్సర్ కణాలు చేరడం సర్వసాధారణం. ఇలాంటి క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు రోగి ఊపిరితిత్తుల్లో 80 శాతం కణాలు ఉంటాయి అని వైద్యులు స్పష్టం చేశారు.

  మరోసారి నిర్మాతల గుండెల్లో రైళ్లు

  మరోసారి నిర్మాతల గుండెల్లో రైళ్లు

  బాలీవుడ్ నిర్మాతలు సంజయ్ దత్ కారణంగా మరోసారి సందిగ్ధంలో పడ్డారు. గతంలో ముంబై పేలుళ్ల కేసులో సంజూ జైలుకు వెళ్లిన సమయంలో కొంత మంది నిర్మాతల సినిమా ఉన్నట్టుంది ఆగిపోయాయి. ఇప్పుడు అనారోగ్యం కారణంగా సంజయ్ దత్‌తో బాలీవుడ్‌లో మరోసారి అలజడి మొదలైంది. ఇప్పుడు సంజయ్ దత్ చేతులో ఆరు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

  రిలీజ్‌కు సిద్దమైన చిత్రాలు

  రిలీజ్‌కు సిద్దమైన చిత్రాలు

  సంజయ్ దత్ నటిస్తున్న చిత్రాల్లో సడక్ 2 రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో ఆగస్టు 28న రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన తోర్బాజ్ చిత్రం పూర్తయింది. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానున్నది. మూడో చిత్రం భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా కూడా డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో రిలీజ్‌‌కు సిద్ధంగా ఉంది.

  షూటింగ్ దశలో ఉన్న సినిమాలు

  షూటింగ్ దశలో ఉన్న సినిమాలు

  ఇక సంజయ్ దత్ పూర్తి చేయాల్సిన సినిమాల్లో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఒకటి. ఈ సినిమాకు సంబంధించి మూడు రోజులు షూటింగ్ మిగిలి ఉంది. సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలోని సంజయ్ దత్ లుక్‌ను జూలై 29న రిలీజ్ చేశారు. ఇక శంషేరా సినిమా విషయానికి వస్తే 4 నుంచి 6 రోజుల షూటింగ్ సంజయ్ దత్‌తో చేయాల్సి ఉంది. ఇక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పృథ్వీరాజ్ సినిమా ఇప్పటి వరకు 40 శాతం మాత్రమే పూర్తయింది.

  సంజయ్ చేతిలో 735 కోట్ల విలువైన సినిమాలు

  సంజయ్ చేతిలో 735 కోట్ల విలువైన సినిమాలు

  ప్రస్తుత పరిస్థితుల్లో సంజయ్ దత్‌తో ముడిపడి ఉన్న సినిమాల బడ్జెట్ విలువ 735 కోట్లు. అయితే ఆయన చేయాల్సిన సినిమాలు, సీన్లు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. కేవలం చిన్నచితక సీన్లు మాత్రమే షూట్ చేయాల్సి ఉన్నాయి. ఇక పృథ్వీరాజ్ సినిమాల్లోనే ఎక్కువ భాగం చిత్రీకరించాల్సి ఉంది. దాంతో సంజయ్ దత్‌తో ఇప్పటికిప్పుడు పెద్దగా నిర్మాతలకు నష్టం వాటిల్లే ప్రశ్నే లేదనే విషయం స్పష్టమవుతున్నది.

  English summary
  Bollywood actor Sanjay Dutt Sanjay Dutt has 735 Crores worth projects, who is diagnosed with lung cancer. In this occassion Maanayata Dutt condemns rumours on Sanjay Dutt health. Sanjay Dutt discharged from Leelavati hospital on August 9th. Sanjay Dutt was admitted to Mumbai's Leelavati hospital after he complained of breathlessness on August 8.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X