ప్రియా వారియర్ ఆశలపై నీళ్లు: ‘టెంపర్’ రీమేక్‌లో స్టార్ హీరో కూతురు!
Recommended Video

తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పోలీస్ డ్రామా 'టెంపర్' సూపర్ హిట్టవ్వడంతో ఈ చిత్రాన్ని హిందీలో రణవీర్ సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయమై కొన్ని రోజులుగా రకరకాల ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ అవకాశం దక్కించుకుందనే వార్తలు సైతం వినిపించాయి. ఈ నేపథ్యంలో రూమర్స్, గాసిప్స్‌కు తెర దించుతూ నిర్మాత కరణ్ జోహార్ అఫీషియల్ ప్రకటన చేశారు.

స్టార్ హీరో కూతురికి ఛాన్స్
‘టెంపర్' హిందీ రీమేక్‌లో రణవీర్ సింగ్ సరసన హీరోయిన్‌గా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌ను ఖరారు చేస్తూ నిర్మాత కరణ్ జోహార్ అఫీషియల్ ప్రకటన చేశారు.

ప్రియా వారియర్ ఆశలపై నీళ్లు
తనకు ‘టెంపర్' రీమేక్ లో అవకాశం వస్తుందనే వార్తలు ప్రచారంలోకి రావడంతో ప్రియా వారియర్ కూడా ఆనంద పడింది. తన అభిమాన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ అని, అతడితో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని కూడా తెలిపారు. అయితే కరణ్ జోహార్ ప్రకటనతో ప్రియా వారియర్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

తొలిసారి కలిసి చేస్తున్నారు
‘టెంపర్' చిత్రాన్ని హిందీలో ‘సింబా' పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. దీంతో పాటు రోహిత్ శెట్టి-కరణ్ జోహార్ కలిసి చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే.
కరణ్ జోహార్ అఫీషియల్ ట్వీట్
సింబా చిత్రంలో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఖరారైంది. డిసెంబర్ 28, 2018న సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. వచ్చే చలికాలంలో ఈ సినిమా వేడి పుట్టించడం ఖాయం అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.

మక్కికి మక్కి రీమేక్ కాదట
‘టెంపర్' చిత్రాన్ని మక్కికి మక్కి రీమేక్ చేయడం లేదని, అందులోని ముఖ్యమైన నాలుగైదు సీక్వెన్స్ మాత్రమే వాడుకోవాలనుకుంటున్నాం. గతంలో సింగమ్ చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేసినపుడు కొన్ని మార్పులు చేశాం. ‘టెంపర్' రీమేక్ విషయంలో కూడా అలాగే చేస్తాం అని దర్శకుడు రోహిత్ శెట్టి తెలిపారు.


Click it and Unblock the Notifications











