Shreya Dhanwanthary జోష్ బ్యూటీ ఘాటు అందాలు.. గ్లామర్ ట్రీట్ మామూలుగా లేదుగా!
బాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ ఎంత పెద్ది విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనోజ్ భాజ్‌పాయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్‌లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రేయ ధన్వంతరి. ఈ ఒక్క సిరీస్ మాత్రమే కాకుండా స్కామ్ 1992లో కూడా మెయిన్ కీ రోల్ ప్లే చేసింది. అయితే ఇప్పుడు హిందీ సిరీస్‌లు, చిత్రాల్లో అలరిస్తోన్న ఈ భామ మొదటగా జోష్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఎంతో హోమ్లీగా కనపడే ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసే అందాల ప్రదర్శన సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.

జోష్ మూవీతో..
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం జోష్. ఈ మూవీ అంతగా ఆకట్టుకోనప్పటికీ, మంచి కథగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో కాలేజ్‌లో నాగ చైతన్యకు భావన అనే ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపించింది శ్రేయ ధన్వంతరి. ఒంటరిగా ఏ గ్యాంగ్‌లో చేరని నాగ చైతన్యతో ఆ కాలేజ్‌లో తమదే మంచి గ్యాంగ్ అని చెబుతూ ఇంట్రడ్యూస్ చేసుకునే సీన్ గుర్తుండే ఉంటుంది.

రాని గుర్తింపు..
ఈ సినిమాతోపాటు సందీప్ కిషన్ నటించిన స్నేహ గీతం చిత్రంలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది శ్రేయ ధన్వంతరి. సినిమాలే కాకుండా పలు టీవీ అడ్వర్టైజ్మెంట్స్లలో కూడా మెరిసింది ఈ భామ. అయితే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో కొద్దిపాటి అవకాశాలు రావడం ప్రారంభమైంది. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసింది శ్రేయ.

వరుసగా ఆఫర్లు..
అప్పటి నుంచి హిందీలో టీవీ షోలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది ముద్దుగుమ్మ శ్రేయ ధన్వంతరి. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 92 సిరీస్‌లతో పాపులర్ అయింది. ఈ సిరీస్‌లతో వచ్చిన క్రేజ్‌తో పలు సినిమా అవకాశాలు కూడా ఆమె వద్దకు చేరాయి. తమిళ్, హిందీ చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగానే తాప్సీ మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన లూప్ లపేటా చిత్రంలో నటించింది.

అలా మొదటి అడుగు..
అయితే ఆ మూవీ అనుకున్నంత హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఇందులో తాప్సీతోపాటు తాహీర్ రాజ్ భాసిన్ కూడా నటించాడు. ఈ మూవీ గురించి శ్రేయ ధన్వంతరి మాట్లాడుతూ ''నేను సినిమాలు చేయడానికి చాలా కారణాలున్నాయి. నాకు నటనపై ఆసక్తి ఎక్కువ. ఎలిప్పిన్, తనూజ, అతుల్ వంటి ప్రముఖలతో కలిసి నేను యాక్టింగ్‌లో మొదటి అడుగులు వేశాను. ఈ చిత్రం టైటిల్ చాలా లూపిగా ఉంది.

ఆసక్తిగా ఎదురచూస్తున్నా..
కొత్త ప్రయోగాలు చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి సమయంలో లూప్ లపేటాలో నటించడం చాలా సంతోషంగా ఉంది'' అని తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఎలిప్సిస్ ఎంటర్టైన్మెంట్స్, ఆయుష్ మహేశ్వరి సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అద్భుత్, చుప్ అనే సినిమాల్లో నటిస్తోంది శ్రేయ ధన్వంతరి.

హాట్ షోతో..
ఇటీవలే చుప్ టీజర్ విడుదల కాగా, ఆకట్టుకునేలా ఉంది. ఇక సినిమాలు, సిరీస్‌ల విషయం పక్కన పెడితే అప్పట్లో హోమ్లీగా కనిపించే శ్రేయ ధన్వంతరి.. ఇప్పుడు హాట్‌గా అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తోంది. తను చేసే ప్రతీ ఫొటోషూట్ అందాల ప్రదర్శనకే అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక తాజాగా లో దుస్తుల్లో తను చేసన హాట్ షో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.
m.com/p/ChmWVklJEd7/?hl=en


Click it and Unblock the Notifications











